టీకా వేసుకోను: అమెరికా స్విమ్మర్‌ మైకెల్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

టీకా వేసుకోను: అమెరికా స్విమ్మర్‌ మైకెల్‌

టోక్యో: తాను టీకా వేసుకోలేదని.. భవిష్యత్తులో అలాంటి ఆలోచన కూడా లేదని టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అమెరికా స్విమ్మర్‌ మైకెల్‌ ఆండ్రూ తెలిపాడు. 613 మంది అమెరికా క్రీడాకారులు ఒలింపిక్స్‌లో బరిలో దిగగా.. అందులో 100 మందికి పైగా టీకాలు వేసుకోలేదని జట్టు వైద్యాధికారి శుక్రవారం తెలిపాడు. వారిలో మైకెల్‌ ఒక్కడే టీకా వేసుకోలేదంటూ బహిరంగంగా ప్రకటించాడని చెప్పాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఐఓసీ, నిర్వాహకులు టీకాను తప్పనిసరి చేయలేదు. అయితే క్రీడాగ్రామంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలవుతోంది. ‘‘ఒలింపిక్స్‌ ముంగిట దేన్నీ నా శరీరంలోకి పంపడానికి నాకిష్టం లేదు. నా దేహం ఎలా స్పందిస్తుందో తెలియదు. అత్యున్నత స్థాయి అథ్లెట్‌గా చేసే ప్రతి పని పక్కాగా, లెక్క ప్రకారం ఉంటుంది. ఒలింపిక్స్‌ సెలెక్షన్స్‌కు ముందు రిస్క్‌ తీసుకోవాలని అనుకోలేదు. టీకా వేసుకుంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి. ఆ కొన్ని రోజులు కోల్పోవడం నాకిష్టం లేదు. భవిష్యత్తులోనూ టీకా తీసుకునే ఆలోచన లేదు’’ అని మైకెల్‌ తెలిపాడు. మైకెల్‌ నిర్ణయాన్ని మాజీ ఒలింపియన్‌ మాయా డిరాడో, మరి కొంతమంది అమెరికా స్విమ్మర్లు తప్పుబడుతున్నారు. మైకెల్‌ తీరు తోటి క్రీడాకారుల్ని ప్రమాదంలోకి నెడుతుందని విమర్శిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన