
తాజావార్తలు
దిల్లీ: ఐపీఎల్ ట్రేడింగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ అజింక్య రహానె దిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్నట్లు సమాచారం. ట్రేడింగ్ విండో ఈ రోజు పూర్తికానున్న నేపథ్యంలో సాయంత్రంలోపు ఈ విషయంపై స్పష్టత రానుంది. అతడి విలువ రూ.4 కోట్లుగా ఉంది. దీనికి బదులుగా దిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్థాన్ ఇద్దరు ఆటగాళ్లని తీసుకోవాలని చూస్తోంది. శిఖర్ ధావన్, పృథ్వీషా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హనుమ విహారిలతో పటిష్టంగా ఉన్న దిల్లీ ఫ్రాంఛైజీ రహానెను తమ జట్టులోకి తీసుకొని బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంపై కొద్ది నెలలుగా రాజస్థాన్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతోంది.
మరోవైపు రహానె రాజస్థాన్ జట్టుతో సంతోషంగా లేడు. గత సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన అతడిని అనూహ్యంగా తొలగించిన యాజమాన్యం, ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించింది. 2011 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రహానె 2018 సీజన్లో కెప్టెన్‌గా కొనసాగాడు. ఈ నేపథ్యంలో రహానె జట్టు మారితే.. కొద్ది రోజుల్లో దిల్లీ కోచ్ రికీపాంటింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతాడు. ఇదిలా ఉండగా రహానె ఐపీఎల్ రికార్డు పరిశీలిస్తే అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ కన్నా మెరుగ్గా ఉంది. 122 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 3820 పరుగులు చేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- కిల్లర్ శ్రీనివాస్‌నూ చంపేయండి!
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఘటనా స్థలికి రానున్న ఎన్హెచ్ఆర్సీ