close
లక్ష్యాల వైపు బాలికల చూపు 

కొన్ని అంశాల్లో మాత్రం వెనుకంజ 
ఈ స్థితి మారేందుకే మా కృషి: ‘నాంది’

ఈనాడు, హైదరాబాద్‌: ఆడపిల్లలు సాధికారత కోరుకుంటున్నారని, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారని నాంది ఫౌండేషన్‌ బాలల విభాగ బాధ్యులు రోహిణీ ముఖర్జీ అన్నారు. మంథన్‌ ఆధ్వర్యంలో శనివారం ‘ట్యాగింగ్‌ ఎ టీనేజర్‌’ అంశంపై ఏర్పాటైన సదస్సులో మాట్లాడుతూ, వారి ఆకాంక్షల సాధనకు వివిధ రూపాల్లో అడ్డంకులు ఉండటంతో పోరు సాగిస్తున్నారన్నారు. 13-19 ఏళ్ల పిల్లలు చదువుకునేందుకే ఆసక్తి చూపుతున్నారని, ఉద్యోగం చేస్తూ సంపాదించిన తర్వాతే వివాహం చేసుకోవాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. తాము నిర్వహించిన అధ్యయనంలో ఇవన్నీ వెల్లడయ్యాయని చెప్పారు. సమాజంలో బాలుర కన్నా తాము తక్కువన్న మానసిక భావన కొందరిలో ఇంకా కనిపిస్తోందని; రక్తహీనత, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వంటి సమస్యలూ బాలికలను బాధిస్తున్నాయని వివరించారు. ఈ స్థితిగతులు మారాలన్న లక్ష్యంతోనే తమ సంస్థ కృషిచేస్తోందని రోహిణీ ముఖర్జీ వివరించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.