close
కీసర అభయారణ్యం దత్తత

2,042 ఎకరాల అటవీ ప్రాంత అభివృద్ధికి ఎంపీ సంతోష్‌కుమార్‌ నిర్ణయం
కేటీఆర్‌ పుట్టిన రోజు సేవా కార్యక్రమాల పిలుపునకు స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని 2,042 ఎకరాల కీసరగుట్ట అభయారణ్యాన్ని తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బుధవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలకు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నట్లు మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు. తనకు వచ్చే ఎంపీ నిధులతో అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, పర్యావరణ పర్యాటక పార్కుగా తీర్చిదిద్దుతానని, హైదరాబాద్‌ వాసులకు బహుమతిగా ఇస్తానని సంతోష్‌ వెల్లడించారు. త్వరలోనే అటవీ ప్రాంతంలో పర్యటించి, అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు.

‘‘కేటీఆర్‌ మా అందరికీ ఆదర్శం. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘చిరునవ్వుతో ఓ బహుమతి’ అంటూ చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న నగర అటవీ పార్కులు అద్భుతంగా ఉన్నాయి. పట్టణప్రాంత వాసులు వారాంతాల్లో కుటుంబంతో సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకునేందుకు.. పర్యావరణం, అడవులు, జీవ వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. కీసర అటవీ ప్రాంతాన్ని ఆ తరహాలో అభివృద్ధి చేస్తా. కీసరగుట్ట, యాదాద్రి ఆలయాలకు వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునేలా మారుస్తా’’ అని సంతోష్‌ తెలిపారు. అటవీ అభివృద్ధికి ఇతరులూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంపీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తామూ భాగస్వాములం అవుతామని పలువురు ట్వీట్‌ చేశారు.

రూబిక్స్‌క్యూబ్‌లతో కేటీఆర్‌ చిత్తరువు
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూకట్‌పల్లికి చెందిన ఆ పార్టీ నేత జగన్మోహన్‌రావు వినూత్న రీతిలో ప్రయత్నం చేశారు. తన కార్యాలయంలో 2100 రూబిక్స్‌క్యూబ్‌లతో కేటీఆర్‌ చిత్తరువును ఏర్పాటుచేయించారు. ఇంత భారీ స్థాయిలో రూపొందించడం దేశంలో ఇదే మొదటిసారని.. తన మేనల్లుడు కౌశిక్‌, అతని స్నేహితుడు శరణ్‌గుప్తాలు ఈ చిత్తరువుకు రూపకల్పన చేశారని చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.