close
గడువులోగా పోలవరం పూర్తవుతుందా?

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అథారిటీ

ఈనాడు, అమరావతి: పోలవరం తాజా పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వంపై పోలవరం అథారిటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రాజెక్టు పనులను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? కొత్త గుత్తేదారుతో ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకుంటారు? వంటి అంశాలతోపాటు నిపుణుల కమిటీ నివేదిక.. అందులోని అంశాలపై ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు, ఆకృతుల ఆమోదం, కార్యాచరణ తదితర అంశాలపై అనేక ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌లో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జైన్‌, సభ్య కార్యదర్శి పాండే ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఒప్పందం ఎప్పుడు?
పోలవరంలో వరద కారణంగా గత కొంత కాలంలో ఎలాంటి పనుల పురోగతి లేని నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ఎప్పుడు చేపట్టబోతున్నారని అథారిటీ సీఈవో జైన్‌ ప్రశ్నించారు. కొత్త గుత్తేదారుతో ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారని అడిగారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, హైకోర్టు స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయని.. తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెప్పారు. తీర్పు వెలువడిన వెంటనే ఒప్పంద ప్రక్రియ పూర్తి చేస్తామని వివరణ ఇచ్చారు. 2021 అక్టోబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యం విధించుకున్నారని, ఆలస్యంవల్ల గడువులోపు పూర్తి చేయగలరా? అని అథారిటీ ప్రశ్నించింది. పనులు ఆలస్యమయ్యే కొద్దీ ఆర్థికంగా భారం అవుతుందన్న విషయంపైనా అడిగింది.

పని పరిమాణంలో తేడా ఎందుకు?
ప్రాజెక్టు అధికారులు ప్రగతి నివేదికలో పేర్కొన్న పనికి, రివర్స్‌ టెండర్లలో పేర్కొన్న పని పరిమాణానికి మధ్య వ్యత్యాసం ఉన్న విషయాన్ని అథారిటీ ప్రస్తావించింది. ఆమోదించిన ఆకృతుల మేరకు ఎంత పని జరిగిందని ప్రగతి నివేదికలో పేర్కొన్నారో.. తదనుగుణంగానే గుత్తేదారుతో ఒప్పందం సమయంలో అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించింది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.