close
వాడి పారేసే ప్లాస్టిక్‌ నిషేధంపై కమిటీ

 అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలి
 ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ నిషేధంపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ ప్లాస్టిక్‌ వాడకం వల్ల వచ్చే సమస్యలు, దీనికి ప్రత్యామ్నాయాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా ఉండే ఈ కమిటీలో- పురపాలక, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ నిషేధంపై ఇటీవల చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం అధ్యయనానికి అధికారుల కమిటీ వేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తాజాగా ఉత్తర్వులు జారీఅయ్యాయి. ప్లాస్టిక్‌ నిషేధం ఉన్న ఇతర రాష్ట్రాలు, అక్కడ అమలుతీరును ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను సూచించాలని, అలాంటి ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలను సూచించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ప్లాస్టిక్‌ పరిశ్రమను కనీస వేతన చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కార్మికశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.