మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌ అధినేత కన్నుమూత
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌ అధినేత కన్నుమూత

పెదకూరపాడు, న్యూస్‌టుడే: మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌ అధినేత జవ్వాది శ్రీహరిరావు (68) కరోనాతో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. 20 రోజులుగా టగుంటూరులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడులో వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన.. తన సోదరులు నరసింహారావు, కోటేశ్వరరావులతో కలిసి 1989లో గుంటూరులో ఒక బస్సుతో ట్రావెల్స్‌ను ప్రారంభించారు. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ప్రయాణ సేవలను విస్తరించారు. ప్రస్తుతం 36 బ్రాంచిల ద్వారా 300కుపైగా బస్సులను తిప్పుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు