టీఎస్‌ఎంసీను నామినేటెడ్‌ సంస్థగా మార్చాలనుకుంటున్నారా?
close

ప్రధానాంశాలు

టీఎస్‌ఎంసీను నామినేటెడ్‌ సంస్థగా మార్చాలనుకుంటున్నారా?

సభ్యుల తగ్గింపుపై హైకోర్టు వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ)కు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను తగ్గించి, నామినేటెడ్‌ సభ్యులను యథాతథంగా ఉంచడమంటే కౌన్సిల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని నామినేటెడ్‌ సంస్థగా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. టీఎస్‌ఎంసీలో ఎన్నిక సభ్యుల సంఖ్యను 13 నుంచి 5 తగ్గిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ డాక్టర్‌ బి.అరుంధతి తదితరులు వేర్వేరుగా మూడు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల ద్వారా 13 మంది, నామినేటెడ్‌ సభ్యులు ఆరుగురితో కౌన్సిల్‌ ఏర్పాటయ్యేదన్నారు. రాష్ట్ర విభజన తరవాత ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను 13 నుంచి 6కు తగ్గించారని, నామినేటెడ్‌ సభ్యులను యథాతథంగా ఉంచారన్నారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో 97 వేల మంది డాక్టర్లు కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారని, ప్రస్తుతం 47 వేల మందే ప్రాక్టీస్‌ చేస్తుండడంతోనే సభ్యుల సంఖ్యను కుదించినట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం కౌన్సిల్‌ ఎన్నికలను జరపరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని