కార్గోతో రూ. 46 కోట్ల ఆదాయం: పువ్వాడ
close

ప్రధానాంశాలు

కార్గోతో రూ. 46 కోట్ల ఆదాయం: పువ్వాడ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా ఏడాది కాలంలో రూ.46 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. కరోనా కాలంలో ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసును ప్రారంభించి శనివారం నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ‘ఆర్టీసీ బస్సుల ద్వారా ఏడాది వ్యవధిలో 32 లక్షల పార్సిళ్లను రవాణా చేశాం. రూ.34 కోట్ల ఆదాయం సమకూరింది. కార్గో సేవల ద్వారా రూ.12 కోట్ల ఆదాయం లభించింది. 177 బస్‌స్టేషన్‌ కౌంటర్లు, 810 ఏజెంట్ల ద్వారా ఈ వ్యవస్థను నిర్వహిస్తున్నామ’ని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ పార్సిళ్లు ఇంటి వద్దే అందజేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి ప్రకటించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని