పలు ప్రాజెక్టుల నిర్మాణ గడువు పొడిగింపు
close

ప్రధానాంశాలు

పలు ప్రాజెక్టుల నిర్మాణ గడువు పొడిగింపు

ఈనాడు హైదరాబాద్‌: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణ గడువును నీటిపారుదల శాఖ పొడిగించింది. ఈపీసీ పద్ధతిలో ఒప్పందం చేసుకున్న ఈ పనులకు పెరిగిన స్టీలు, సిమెంటు, ఇతర సామగ్రి ధరలను అదనంగా చెల్లించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పనులను పూర్తి చేయడానికి గడువును నిర్దేశించింది. భూసేకరణ, పునరావాసం సహా పలు కారణాల వల్ల పనులు పూర్తికాకపోవడంతో మరోసారి గడువు పొడిగించడానికి ఇటీవల మంత్రివర్గం అంగీకరించింది. దీనికి అనుగుణంగా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాలువ, ఎ.ఎం.ఆర్‌.పి. తదితర ప్రాజెక్టుల కింద గల 61 ప్యాకేజీల పనులకు ఇది వర్తిస్తుంది. ఈ ప్యాకేజీల కింద 16,905 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉండగా, 10.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని