మానవహక్కుల వేదిక నాయకురాలు జయశ్రీ కన్నుమూత

ప్రధానాంశాలు

మానవహక్కుల వేదిక నాయకురాలు జయశ్రీ కన్నుమూత

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: మానవహక్కుల పోరాట యోధురాలు కాకుమాను జయశ్రీ (60) శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈమెకు భర్త అత్తాఫ్‌, కుమారుడు అనుష్‌ ఉన్నారు.  జయశ్రీ 1986లో న్యాయవిద్యలో పట్టభద్రులై, ప్రొద్దుటూరులో న్యాయవాదిగా చేసేవారు. ప్రముఖ హక్కుల నేత బాలగోపాల్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె పార్థివ దేహానికి కడప జిల్లా ప్రొద్దుటూరులో అశేష అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మానవహక్కుల వేదిక కడప జిల్లా కన్వీనర్‌గా జయశ్రీ ఉన్నారు. 30 ఏళ్లుగా మహిళలు, దళితులు, అణగారినవర్గాల హక్కుల కోసం పోరాడారని, జిల్లాలో ఫ్యాక్షన్‌ ఆధిపత్యాన్ని సైతం ధైర్యంగా ఎదిరించిన ధీశాలి అని మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ అన్నారు.
మృతదేహాన్ని దివంగత హక్కుల నేత బాలగోపాల్‌ సహచరి వసంతలక్ష్మి ప్రొద్దుటూరు శ్రీ రాజరాజేశ్వరి కాలనీలోని ఇంటికి తీసుకొచ్చారు. జయశ్రీ రెండు కళ్లను దానం చేశారు. ఆమె మరణవార్త విన్న హక్కుల సంఘాల నేతలు, అభిమానులు, మిత్రులు, సన్నిహితులు, వామపక్ష, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడి,్డ ఎమ్మెల్సీల రమేష్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని