చెక్‌డ్యాంల లోపాలపై విజిలెన్స్‌!

ప్రధానాంశాలు

చెక్‌డ్యాంల లోపాలపై విజిలెన్స్‌!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉపనదులు, వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణాలకు సంబంధించి విజిలెన్స్‌తో విచారణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో నిర్మిస్తున్నవాటితోపాటు పలు ప్రాంతాల్లో లోపాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2847.71 కోట్లలో 596 డ్యాంల నిర్మాణాలు చేపట్టగా 109 పూర్తయ్యాయి. 148 చివరి దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాల్లో సరైన డిజైన్‌లను అనుసరించకపోవడంతో కొన్ని వరదలకు కొట్టుకుపోవడం, కోతకు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖలో చెక్‌డ్యాంల నిర్మాణాలకు సంబంధించిన దస్త్రాల పరిశీలన, అనంతరం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసేందుకు వీలుగా వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని