చెక్‌డ్యాంల నిర్మాణాల్లో లోపాలు

ప్రధానాంశాలు

చెక్‌డ్యాంల నిర్మాణాల్లో లోపాలు

క్షేత్రస్థాయి పరిశీలనకు ఈఎన్‌సీ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: చెక్‌డ్యాంల నిర్మాణాల్లో లోపాలు తలెత్తడంపై నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ ముఖ్య ఇంజినీర్లను అప్రమత్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌ జలసౌధ నుంచి ఆన్‌లైన్‌లో రాష్ట్రంలోని 19 సర్కిళ్ల సీఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నిర్మాణ దశలో ఉండగానే కొన్ని కొట్టుకుపోవడం, ముక్కలు చెక్కలు కావడానికి కారణాలను అడిగినట్లు సమాచారం. మార్చి నాటికి అన్ని డ్యాంలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. వర్షాలకు కొట్టుకుపోయిన చెక్‌డ్యాంలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని నీటిపారుదల (చిన్న నీటి) సలహాదారు, విశ్రాంత ఈఎన్‌సీ విజయ్‌ ప్రకాశ్‌, చెక్‌డ్యాంల ఇన్‌ఛార్జి సీఈ చంద్రశేఖర్‌ను ఈఎన్‌సీ ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని