విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రధానాంశాలు

విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

  నవంబరు 30 వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యానిధి పథకం కింద నవంబరు 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం తెలిపారు. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించని, 35 ఏళ్లలోపు వారు అర్హులని వెల్లడించారు. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, అగ్రికల్చర్‌, వైద్య, నర్సింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ రంగాల్లో 60% మార్కులు కలిగి, సీవోఈ, ఐ-20, వీసా పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు ఈ-పాస్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని