‘టీకాలపై దుష్ప్రచారం తగదు’

ప్రధానాంశాలు

‘టీకాలపై దుష్ప్రచారం తగదు’

ఈనాడు, హైదరాబాద్‌: టీకా తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్‌, పింఛన్‌ నిలిపివేస్తారని వైద్యఆరోగ్యశాఖ చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనీ, ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళనలకు గురికావద్దని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదనీ ఆయన స్పష్టంచేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు టీకాలు పొందడానికి ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని