close

ప్రధానాంశాలు

లూటీకి గురైన మంత్రి కడియం దొరికింది

శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పగించిన ఓ వ్యక్తి

మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం), న్యూస్‌టుడే: రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధించి తస్కరణకు గురైన బంగారు చేతి కడియం దొరికింది. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దాన్ని తీసుకొచ్చి ఆయనకు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో గురువారం ఓ వివాహానికి హాజరైన క్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతికి ఉన్న కడియం లూటీకి గురైన విషయం విదితమే. సంబంధిత వేడుక జరిగిన ప్రదేశంలో అది కింద పడిపోవడంతో తీసుకున్నానని,‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తను చూసి దాన్ని తిరిగి ఇచ్చేందుకు వచ్చానని చెప్పి మంత్రికి ఆ కడియాన్ని ఆయన అప్పగించారు. సదరు వ్యక్తి నుంచి పోలీసులు, అధికారులు రాతపూర్వకంగా లేఖ సైతం తీసుకున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.