close

ప్రధానాంశాలు

ఈ నిబంధనలు పాటించాల్సిందే

కరోనా నిర్ధారణ అయితే కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్‌లో ఉండాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 25,937 మంది స్వీయ గృహ నిర్బంధ పరిశీలన(క్వారంటైన్‌)లో ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా వీరు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంటూ, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

* స్వీయ పరిశీలనలో ఉన్నవారికి ప్రత్యేక గది, అనుబంధంగా ప్రత్యేక మరుగుదొడ్డి ఉండేలా చూసుకోవాలి.
* స్నానాల గదిని, మరుగుదొడ్డిని రోజూ క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయాలి.గదికి గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
* మరొక కుటుంబసభ్యుడు ఆ గదిలో ఉండాల్సి వస్తే తప్పనిసరిగా నాలుగు అడుగుల భౌతిక దూరం పాటించాలి.
* ఇంట్లో వృద్ధులు, గర్భిణులు, పిల్లలు; మధుమేహం, క్షయ, కిడ్నీ, గుండెజబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుంటే.. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి.
* ఆ వ్యక్తి గదిలో తన కదలికలను పరిమితం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గది బయటకు రాకూడదు. ఏ కార్యక్రమాలకూ హాజరు కారాదు. ఇతరులను ఇంట్లోకి అనుమతించకూడదు.
* చేతి శుభ్రతను పాటించాలి. ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లను వినియోగించాలి. కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శస్త్రచికిత్సల్లో వినియోగించే మాస్కులను ధరించాలి.
* ఆ వ్యక్తి ఉపయోగించే వస్తువులు, దుస్తులు, తువ్వాలును ఇతరులు వినియోగించొద్దు.
* మాస్కులను ప్రతి 6-8 గంటలకోసారి మార్చి, నిర్దేశిత నిబంధనల ప్రకారం పారేయాలి.
* గృహ పరిశీలనలో ఉన్నప్పుడు కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే 104కు ఫోన్‌ చేయాలి.
* స్వీయ పరిశీలనలో ఉన్న వ్యక్తిలో వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయితే.. ఆ కుటుంబీకులు  14 రోజులు క్వారంటైన్‌లో ఉంటూ.. నిబంధనలు పాటించాలి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.