close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ధర తగ్గించినవారి నుంచి రెండింతల డిపాజిట్‌

‘ఈనాడు’ కథనానికి మత్స్యశాఖ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: చేప, రొయ్యపిల్లల పంపిణీ టెండర్లలో తక్కువ ధరను పేర్కొన్నవారి నుంచి నిర్ణీత డిపాజిట్‌ కన్నా 2 రెట్లు అదనంగా వసూలుచేయాలని నిర్ణయించినట్లు మత్స్యశాఖ స్పష్టం చేసింది. కొందరు వ్యాపారులు ధరలు తగ్గించి టెండర్లు వేసిన వైనంపై ‘చేపా చేపా చెరువులోకి చేరేనా !’  శీర్షికతో ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి ఈ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ అనితా రాజేంద్ర స్పందించారు. మొత్తం 14 జిల్లాల్లో తక్కువ కోట్‌ చేస్తూ టెండర్లు వేసిన మాట వాస్తవమేనన్నారు. ఈ టెండర్‌దారులందరినీ రెండింతల అదనపు డిపాజిట్‌ కట్టాలని ఆదేశించామన్నారు. కట్టకపోతే మరో మూడేళ్లదాకా టెండర్లలో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటిస్తామని తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.