close
ప్రాణం తీసిన కంచె

పంటకు రక్షణగా ఏర్పాటు చేసిన కంచె ఓ జింక పాలిట యమపాశంగా మారిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మద్నూర్‌ సమీపంలో సోమలింగం గుట్ట వెళ్లే మార్గంలో ఓ పంట పొలానికి రక్షణగా ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేశారు. అందులోకి వెళ్లేందుకు ఓ జింక ప్రయత్నించగా కంచెలో ఇరుక్కొని మృతిచెందింది. శుక్రవారం ఉదయం స్థానికులు దీన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతోనే జింక మృతి చెందినట్లు పశువైద్యాధికారి విజయ్‌కుమార్‌ తెలిపారు.

- న్యూస్‌టుడే, మద్నూర్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.