Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175200
            [news_title_telugu_html] => 

ప్రమాదానికి ప్రయాణం 

[news_title_telugu] => ప్రమాదానికి ప్రయాణం  [news_title_english] => [news_short_description] => కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ వద్ద సోమవారం పోలీసుల కంటపడిన 7 సీటర్‌ ఆటోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య అక్షరాలా 24.  [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,33,32, ) )
ప్రమాదానికి ప్రయాణం  - EENADU
close
ప్రమాదానికి ప్రయాణం 

పేరు 7 సీటర్‌ ఆటో.. ఎక్కేది 15-20 మందిపైనే 
ప్రమాదాలకు గరిష్ఠ అవకాశం 
గాలిలో దీపాల్లా ప్రయాణికుల ప్రాణాలు 
కరవైన ప్రభుత్వ నియంత్రణ 
ఈనాడు - హైదరాబాద్‌

* కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ వద్ద సోమవారం పోలీసుల కంటపడిన 7 సీటర్‌ ఆటోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య అక్షరాలా 24. 
* మహబూబ్‌నగర్‌ జిల్లాలో మిడ్జిల్‌ నుంచి వెళుతున్న ఓ ఆటోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 16. ఇదే మండలంలో గడిచిన వారంలో ఎదురుగా వస్తున్న లారీ.. ఆటోను ఢీ కొట్టడంతో 13 మంది మృత్యువాత పడ్డారు.

పరిమితికి మించి ప్రయాణికులను కుక్కి ప్రయాణించే వాహనాలు కనిపించని ఘడియ లేదు. రక్తంతో తడవని రహదారి లేదు. అయినా నియంత్రణ దిశగా యంత్రాంగం పటిష్ఠ కార్యాచరణతో ముందుకు రావడం లేదు. కేవలం ఆటోలనే కాదు, జీపులు, పలుచోట్ల ఆర్టీసీ బస్సుల పరిస్థితీ ఇలానే ఉంది. ప్రజా రవాణా పటిష్ఠంగా లేకపోవటం, సామర్థ్యాన్ని మించి ప్రయాణికులతో వెళ్లే వాహనాలను కట్టడి చేసే యంత్రాంగం లేకపోవడం, పట్టుపడితే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం వాహన డ్రైవర్లలో లేకపోవటం.. ఏదో ఒక వాహనం ఎక్కి.. కాస్త సర్దుకునైనా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ప్రజల బలహీనత.. వెరసి రహదారులు రణక్షేత్రాలవుతున్నాయి. అమాయక ప్రజలు  అర్ధాయుష్షుతో జీవితం చాలిస్తున్నారు. మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

లోపం ఎక్కడ 
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులు పరిమిత సంఖ్యలోనే ఉండడంతో ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలే శరణ్యమవుతున్నాయి. ప్రయివేటు రవాణా రాజ్యమేలుతోంది. ఆటోలు, జీపులే కాదు ఆర్టీసీ బస్సులూ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకుంటే మృతుల సంఖ్య ఆందోళన కలిగించే సంఖ్యలో ఉంటోంది. ప్రజల అవసరాలకు తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపలేని పరిస్థితి ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండగా.. పీకల్లోతు అప్పులు, నష్టాల్లో ఉన్న ఆర్టీసీ, ప్రజల అవసరాలకు తగినట్లు బస్సులు నడపలేని పరిస్థితిలో ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమస్యకు మూలాన్ని గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ప్రైవేటు వాహన నిర్వాహకులు, ప్రయాణికుల్లో అవగాహన కల్పించటంతో పాటు నిబంధనలను కఠినతరం చేయాల్సి ఉంది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.