బడ్జెట్‌ ఫోనా..ఇవిగో 2020 బెస్ట్‌ మోడల్స్‌.. 
close

Published : 30/12/2020 19:36 IST
బడ్జెట్‌ ఫోనా..ఇవిగో 2020 బెస్ట్‌ మోడల్స్‌.. 

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ మొబైల్‌ మార్కెట్లో భారత్‌ది రెండో స్థానం. అందుకే మొబైల్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ విడుదల చేస్తూ భారతీయ యూజర్స్‌ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అంతేకాదు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్‌తో ఫోన్లను తీసుకొస్తుంటాయి. కొవిడ్‌-19 ప్రభావంతో మొబైల్‌ మార్కెట్‌ కాస్త మందగమనంలో నడిచినప్పటికీ లాక్‌డౌన్‌ తర్వాత వరుస లాంఛ్‌లతో కొత్త మోడల్స్ సందడి చేశాయి. వీటిలో ఖరీదైన మోడల్స్‌ నుంచి బడ్జెట్‌ మోడల్స్ ఉన్నాయి. కొత్త ఫీచర్స్‌తో ఎన్ని రకాల మోడల్స్‌ వచ్చినా ఎంట్రీ  లెవల్ ఫోన్లకు ఉండే గిరాకీ వేరు. ఎంత ఖరీదైన ఫోన్ వాడుతున్నా బ్యాకప్‌ కోసం బడ్జెట్ ఫోన్‌కే మొగ్గు చూపుతాం. 

అంతేకాదు భారత మార్కెట్లో ఈ ఎంట్రీ లెవల్‌ ఫోన్లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అందుకే మొబైల్‌ కంపెనీలు ఏడాదిలో కనీసం ఒక కొత్త మోడల్‌ను బడ్జెట్‌ ధరలో భారత మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. మరి ఈ 2020లో బడ్జెట్‌ ధరలో భారత మార్కెట్లో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు ఏంటి..వాటిలో ఏమేం ఫీచర్స్‌ ఉన్నాయి‌..వాటి ధరెంత వంటి వివరాలపై మరోసారి లుక్కేయండి.. 


శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌01

శాంసంగ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 5.7-అంగుళాల పీఎల్‌ఎస్‌ ఐపీఎస్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో మూడు కెమెరాలున్నాయి. వెనక వైపు 13ఎంపీ కెమెరాతోపాటు 2ఎంపీ కెమెరా ఉంది. ముందు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 3జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి వేరియంట్‌ ధర రూ. 7,499. 


రెడ్‌మీ 9

ఎక్కవ ఫీచర్స్‌ తక్కువ ధరలో ఫోన్‌ అంటే ప్రతి ఒక్కరి ఎంపిక రెడ్‌మీ. ఈ కేటగిరీలో రెడ్‌మీ మూడు మోడల్స్‌ని అందిస్తుంది. రెడ్‌మీ 9, 9ఏ, 8ఏ డ్యూయల్. రెడ్‌మీ 9లో 6.53-అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్  హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక 13ఎంపీతో పాటు 8ఎంపీ, 5ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంతో 8ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.  3జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి, 4జీబీ ర్యామ్‌/64జీబీ, 6జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 8,999.  


రెడ్‌మీ 9ఏ

ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ25 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.53-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనక వైపు 13ఎంపీ కెమెరా, ముందు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 2జీబీ ర్యామ్‌/32జీబీ అంతర్గత మెమొరీ, 3జీబీ ర్యామ్‌‌/32జీబీ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6,999. 


రెడ్‌మీ 8ఏ డ్యూయల్‌ 

ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.22 హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఈ ఫోన్‌లో రెండు కెమెరాలున్నాయి. వెనక వైపు 13ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్‌ సెన్సర్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 2జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్ స్టోరేజి, 3జీబీ ర్యామ్‌/32జీబీ, 3జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 6,999. 


రియల్‌మీ సీ11

రియల్‌ సీ11 మోడల్‌లో మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5-అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనక రెండు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 13ఎంపీ, 2ఎంపీ కెమెరాలున్నాయి. ముందు భాగంలో 5ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 2జీబీ ర్యామ్‌/32జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ. 7,499.  


రియల్‌మీ నార్జో 20ఏ

ఈ ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనక 12ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా ఇస్తున్నారు. ముందు సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 3జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 8,999.


పొకో సీ3 

పొకో స్మార్ట్‌ఫోన్‌ శ్రేణిలో సీ3 తొలి బడ్జెట్‌ ఫోన్‌. అందుబాటు ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.43-అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 13ఎంపీ కెమెరాతో పాటు 2ఎంపీ కెమెరాలు రెండు అమర్చారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 3జీబీ ర్యామ్‌/32జీబీ అంతర్గత మెమొరీ, 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్లో లభిస్తుంది. సీ3 ప్రారంభ ధర రూ. 7,900. 


ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 4 ప్లస్‌ 

ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్ 4 ప్లస్‌లో 6.82-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత  ఎక్స్‌ఓఎస్‌ 6.2 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో ఏ25 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనక 13ఎంపీ ప్రైమరీ కెమెరాతో ముందు 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 3జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,499. 


ఒప్పో ఏ12 

ఎంట్రీలెవల్‌ మార్కెట్‌ లక్ష్యంగా 2020 ఏప్రిల్‌ నెలలో ఒప్పో ఏ12 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 6.22-అంగుళాల హెచ్‌డీ+ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 9 ఆధారిత కలర్‌ఓఎస్‌ 6.1.2 ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడు కెమెరాలున్నాయి. వెనక 13ఎంపీ, 2ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందు 5ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 3జీబీ ర్యామ్‌/32 ఇంటర్నల్ స్టోరేజి, 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 8,990.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న