యాపిల్ వాచ్‌తో కొవిడ్-19 లక్షణాల గుర్తింపు..!
close

Published : 12/02/2021 08:38 IST
యాపిల్ వాచ్‌తో కొవిడ్-19 లక్షణాల గుర్తింపు..!

ఇంటర్నెట్ డెస్క్‌: సంప్రదాయంగా నిర్ధారణ పరీక్షలకంటే ముందస్తుగానే యాపిల్ వాచ్‌తో కొవిడ్-19 లక్షణాలను గుర్తించవచ్చని అంటున్నారు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి హెల్త్‌ సిస్టంకు చెందిన శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలో ఈ విషయాన్ని కనుగొంది. ఈ మేరకు వేరబుల్ హార్డ్‌వేర్ (ఒంటిపై ధరించే స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌) పరికరాలపై వారు జరిపిన పరిశోధనలకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్‌ ప్రచురించింది. దీనికి సంబంధించిన వివరాలను మౌంట్ సినాయిలోని ఇచ్చాన్ స్కూల్ ఆఫ్ మెడిసెన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాబర్ట్ హైర్టెన్ వెల్లడించారు. 

‘‘ఈ పరిశోధన కోసం మా సంస్థలో పనిచేస్తున్న వందల మంది హెల్త్‌కేర్ వర్కర్ల ఆరోగ్య ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్నాం. ఇందులో పాల్గొన్న వారంతా యాపిల్ వాచ్‌ ధరించారు. ప్రతిరోజూ పరిశోధన కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. అలానే యాపిల్ వాచ్‌ ద్వారా వారి గుండె వేగంలో వ్యతాసాన్ని నమోదు చేశాం. దాని ఆధారంగా వారి శరీరంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేసి కొవిడ్‌-19 లక్షణాలను ముందుగానే గుర్తించగలిగాం’’ అని అన్నారు. కానీ వారం తర్వాత అంటే పూర్తిగా కొవిడ్‌-19 నిర్ధారణ అయిన తర్వాత మాత్రం వైరస్‌ బారిన పడినవారి గుండె వేగం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు గుర్తించామని పరిశోధన పత్రంలో వెల్లడించారు. అలానే భవిష్యత్తులో ప్రజలు ఇన్ఫెక్షన్‌ కారణంగా అనారోగ్యానికి గురవకముందే దానిని గుర్తించే సాధనాలను ఆవిష్కరించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని రాబర్ట్ తెలిపారు. 

ఇవీ చదవండి..  

స్వచ్ఛ కంప్యూటర్‌కు పంచ సూత్రాలు..

ఆడుకోండి హాయిగా.. గూగుల్‌ డూడుల్‌ గేమ్స్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న