ఇక అందరూ‘స్పేసెస్‌’ హోస్ట్‌లే
close

Published : 27/10/2021 01:58 IST

ఇక అందరూ‘స్పేసెస్‌’ హోస్ట్‌లే

టీవల ట్విటర్‌ ప్రవేశపెట్టిన ఆడియో చాట్‌రూమ్‌ ‘స్పేసెస్‌’ రోజురోజుకీ ఆదరణ పొందుతోంది. కాబట్టే దీన్ని మరింత విస్తృతం చేయటంపై ట్విటర్‌ దృష్టి సారించింది. స్పేసెస్‌ హోస్ట్‌గా ఇకపై అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయించింది. సాధారణంగా ఏదైనా ఆడియో సమావేశాన్ని ఆరంభించాలని భావించేవారు ముందుగా హోస్ట్‌గా స్పేస్‌ను సృష్టించుకొని, ఇతరులకు ఆహ్వానం పలుకుతారు. ఇష్టమున్నవారు దానికి కనెక్ట్‌ అయ్యి భేటీలో పాల్గొంటారు. ఇప్పటివరకూ కనీసం 600 మంది ఫాలోవర్లు ఉన్నవారికే ఇలా హోస్టింగ్‌ చేసే అవకాశముండేది. ఇకపై ఫాలోవర్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎవరైనా స్పేసెస్‌ సమావేశాన్ని ఆరంభించటానికి వీలుంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు వాడేవారందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ఐఓఎస్‌ పరికరాలు వాడేవారికైతే అదనంగా ‘టికెటెడ్‌ స్పేసెస్‌’ వెసులుబాటు కూడా దక్కనుంది. దీంతో హోస్ట్‌లు తమ ప్రత్యక్ష ఆడియో కార్యక్రమాలను అమ్ముకోవచ్చు. అంటే ఇందులో పాల్గొనాలని అనుకునేవారు టికెట్‌ కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న