Microsoft Cloud: అజ్యూర్ క్లౌడ్ యూజర్స్‌కి మైక్రోసాఫ్ట్ కీలక సూచన..! 
close

Published : 30/08/2021 23:55 IST
Microsoft Cloud: అజ్యూర్ క్లౌడ్ యూజర్స్‌కి మైక్రోసాఫ్ట్ కీలక సూచన..! 

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్‌ క్లౌడ్ సేవలు ఉపయోగించుకునే యూజర్స్‌కి ఆ కంపెనీ కీలక సూచన చేసింది. అజ్యూర్‌ వినియోగదారులు తమ ఖాతాల్లో లాగిన్ అయ్యేందుకు ఉపయోగించే డిజిటల్‌ యాక్సెస్‌ కీలను మార్చుకోవాలని సూచించింది. కొద్దిరోజుల క్రితం అజ్యూర్‌ క్లౌడ్ సెక్యూరిటీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు విజ్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. దాంతోపాటు ప్రయోగాత్మకంగా కొంతమంది యూజర్స్‌ ఖాతాలను యాక్సెస్ చేసినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మైక్రోసాఫ్ట్‌కు అందించినట్లు వెల్లడించింది. ఈ లోపం కారణంగా సైబర్‌ నేరగాళ్లు సులభంగా యూజర్స్ ఖాతాల్లోకి ప్రవేశించి డేటాను డిలీట్‌ చేయడం, డేటాలో మార్పులు చేయడంతోపాటు డేటాను దొంగలించగలరని విజ్‌ తెలిపింది.

దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్ లోపాన్ని సరిచేసినట్లు వెల్లడించింది. అలానే విజ్‌ యాక్సెస్‌ చేసిన ఖాతాదారులకు తమ డిజిటల్‌ యాక్సెక్‌ కీలను మార్చుకోవాలని కోరింది. అలానే ప్రపంచ్యవాప్తంగా ఉన్న జ్యూర్ క్లౌడ్ యూజర్స్ అందరు తమ ఖాతాలను కొత్త కీలతో భద్రపరచుకోవాలని సూచించింది. ‘‘మా విచారణలో యూజర్స్‌ ఖాతాల్లోకి ఎలాంటి అనధికారిక ప్రవేశాలు జరగలేదని గుర్తించాం. ఇప్పటికే విజ్‌ అందించిన సమాచారం ఆధారంగా కొంతమంది యూజర్స్‌ మెయిల్స్ ద్వారా సమాచారాన్ని అందించాం. ముందు జాగ్రత్త చర్యగా యూజర్స్‌ తమ ఖాతాల ప్రైమరీ రీడ్‌-రైట్‌ కీలను మార్చుకోవాలని సూచించాం’’ అని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పేర్కొంది. తెలిపింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న