close

Published : 09/03/2021 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రియల్‌మీ 8 ప్రో 5G: స్పెసిఫికేషన్స్ ఇవేనా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రియల్‌మీ 8 సిరీస్‌లోని కొత్త మోడళ్లు త్వరలో భారత్‌లో విడుదల కానున్నాయా..? అవునంటున్నాయి టెక్‌ వర్గాలు. మార్చి చివరి వారంలో దేశీయ విపణిలోకి తీసుకొచ్చేందుకు రియల్‌మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రియల్‌మీ 8 (4G), రియల్‌మీ 8 ప్రో (4G), రియల్‌మీ 8 ప్రో (5G) మోడళ్ల స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 108 ఎంపీ కెమెరా ఫీచర్‌తో రియల్‌మీ 8 ప్రో (5G) రావొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 4G సపోర్ట్‌తో వచ్చే రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 730G ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం. దీనిపై ఈ వారంలో రియల్‌మీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మోడళ్లకు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవేనంటూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి అవేంటో మనమూ ఓసారి తెలుసుకుందామా..?

4G సపోర్ట్‌తో రియల్‌మీ 8..


 

* ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 720G ఎస్‌వోసీ
* ర్యామ్‌: 4 GB, 8GB
* లభించే రంగులు: సైబర్‌ సిల్వర్‌, సైబర్‌ బ్లాక్‌
* ధర: తెలియాల్సి ఉంది
* విడుదల తేదీ: మార్చి చివరిలో ఉండొచ్చు


5G సపోర్ట్‌.. 108 ఎంపీ కెమెరాతో రియల్‌మీ 8 ప్రో.. 

* ప్రాసెసర్‌: మీడియోటెక్ డైమెన్సిటీ 720
* ర్యామ్‌: 6GB, 8GB
* కెమెరా: 108 MP ప్రైమరీ కెమెరా
* బ్యాటరీ: 4,500mAh, 65W ఫాస్ట్‌ ఛార్జింగ్‌
* లభించే రంగులు: నలుపు, పసుపు 
* ధర: రూ.19,999 (4G) రూ. 24,999 (5G) (అంచనా)
* విడుదల తేదీ: మార్చి 23 (అంచనా)

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు