Realme: రియల్‌మీ ఫోన్‌ వాడుతున్నారా?  ఈ అప్‌డేట్‌ మీకోసమే!
close

Published : 27/08/2021 23:22 IST
Realme: రియల్‌మీ ఫోన్‌ వాడుతున్నారా?  ఈ అప్‌డేట్‌ మీకోసమే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల రియల్‌మీ కంపెనీ విడుదల చేసిన ఫోన్లలో కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. అదే వర్చువల్‌ ర్యామ్‌/ఎక్స్‌టెండెడ్‌ ర్యామ్‌ టెక్నాలజీ. దీని సాయంతో ఫోన్‌ స్టోరేజ్‌లోని కొంత భాగాన్ని ఫోన్‌లోని ర్యామ్‌ ఉపయోగించుకుంటుంది. ఉదాహరణకు ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌ ఇస్తే.. ఫోన్‌ మెమొరీ నుంచి 3 జీబీ స్టోరేజీని ఉపయోగించుకుని 9జీబీ ర్యామ్‌ సామర్థ్యంతో ఫోన్ పనిచేస్తుంది. దీనివల్ల ర్యామ్‌పై ఒత్తిడి తగ్గి ఫోన్‌ మరింత వేగంగా పనిచేయడంతోపాటు యాప్‌లు త్వరగా లోడ్‌ అవుతాయని రియల్‌మీ తెలిపింది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన నార్జో సిరీస్ మోడల్స్‌లో ఈ తరహా టెక్నాలజీని రియల్‌మీ పరిచయం చేసింది.

తాజాగా రియల్‌మీ పాత ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం ద్వారా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారట. రియల్‌మీ ఎక్స్‌ సిరీస్‌, 8 సిరీస్‌, 7 సిరీస్, 6 సిరీస్‌, నార్జో సిరీస్‌, క్యూ 3 సిరీస్‌, క్యూ 2 సిరీస్‌, వీ3 సిరీస్‌, వీ15, జీటీ సిరీస్‌ మోడల్స్‌లో వర్చవల్ ర్యామ్‌ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నట్లు ఇండియన్ టెక్ బ్లాగర్ ఒకరు తెలిపారు. త్వరలోనే రియల్‌మీ ప్యాడ్ పేరుతో ట్యాబ్‌ తీసుకురానుంది. ఇందులో 10.4-అంగుళాల పెద్ద అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. 6జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ఉంటాయని తెలుస్తోంది. 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. 8ఎంపీ కెమెరా ఇస్తున్నారట. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ వన్‌యూఐ 2.0 ఓఎస్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుందట. అక్టోబరు రెండో వారంలో ఈ ట్యాబ్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ. 20 వేలు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న