5G Network: ఒప్పోతో జియో జట్టు..రియల్‌మీ మాగ్‌డార్ట్‌ 
close

Published : 29/07/2021 23:45 IST
5G Network: ఒప్పోతో జియో జట్టు..రియల్‌మీ మాగ్‌డార్ట్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో 5జీ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నెట్‌వర్క్ కంపెనీలు మొబైల్ తయారీ సంస్థలతో జట్టు కడుతున్నాయి. తాజాగా రిలయన్స్ జియో ముంబయి, గుర్‌గ్రావ్‌ నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని ఒప్పో కంపెనీతో కలిసి పరీక్షించనుంది. ఇందుకోసం ఒప్పో కొత్తగా విడుదల చేసిన రెనో 6 సిరీస్‌ 5జీ ఫోన్లను ఉపయోగించనున్నారు. రెనో 6 ప్రో మోడల్‌ 11 రకాల 5జీ నెట్‌వర్క్‌లను, రెనో 6 మోడల్ 13 రకాల 5జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు నిర్వహించిన 5జీ పరీక్షలు నెట్‌వర్క్ రద్దీ కారణంగా సబ్‌-6గిగాహెర్జ్‌ సామర్థ్యంతో నిర్వహించారు. దీంతో పరీక్షల్లో 1జీబీపీఎస్ వేగాన్ని  మాత్రమే అందుకునేవి. తాజాగా మొబైల్ కంపెనీలు వివిధ రకాల నెట్‌వర్క్ సామర్థ్యాలను సపోర్ట్ చేసే విధంగా ఫోన్లను తయారుచేస్తుండటంతో నెట్‌వర్క్ కంపెనీలు వాటితో కలిసి 5జీ నెట్‌వర్క్‌లను పరీక్షించేందుకు మొగ్గుచూపుతున్నాయి. ‘‘రిలయన్స్‌ జియో తన 5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌ను ఒప్పో ఫోన్ల ద్వారా పరీక్షించాలనుకోవడం శుభపరిమాణం. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కలయిక ఎంతగానో దోహదపడుతుంది’’ అని ఒప్పో కంపెనీ ఆర్‌అండ్‌డీ హెడ్‌ తస్లీమ్‌ ఆరిఫ్ తెలిపారు.  

రియల్‌మీ వైర్‌లెస్ ఛార్జింగ్ 

రియల్‌మీ కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం మాగ్నటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో తొలి డివైజ్‌ను తీసుకురానుంది. దీనిపై రియల్‌మీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ‘రియల్‌మీ మాగ్‌డార్ట్‌’ పేరుతో కొత్త ఛార్జింగ్‌ టెక్నాలజీకి సంబంధించిన సమాచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్‌ చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మాగ్‌ ఫర్ ఫ్యూచర్ పేరుతో గుండ్రని ఆకారంలో ఉన్న బొమ్మను ఆయన ట్వీట్ చేశారు. ‘‘తర్వాతి తరం ఆండ్రాయిడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ కు సిద్ధంకండి. రియల్‌మీ మీకోసం మాగ్‌డార్ట్‌ని తీసుకొస్తుంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇతర వైర్‌లెస్ ఛార్జింగ్ డివైజ్‌లతో పోలిస్తే మాగ్‌డార్ట్ 440 శాతం వేగంగా పనిచేస్తుందని తెలిపారు. దీంతో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 3 తేదీన దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న