Video Game: 36 ఏళ్లనాటి వీడియోగేమ్‌కు వామ్మో ఇంత ధరా..!
close

Updated : 08/08/2021 21:37 IST

Video Game: 36 ఏళ్లనాటి వీడియోగేమ్‌కు వామ్మో ఇంత ధరా..!

(Photo Courtesy: Rally)

ఇంటర్నెట్‌డెస్క్‌: పురాతన వస్తువులు వేలం నిర్వహించినప్పుడు అధిక ధరకు అమ్ముడైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ, 36 ఏళ్ల క్రితం రూపొందించిన వీడియోగేమ్ కోట్ల ధర పలకడం విశేషం. 1985లో రూపొందించిన సూపర్ మారియో బ్రోస్ అనే వీడియో గేమ్‌ని ఒక వ్యక్తి  2 మిలియన్ డాలర్స్‌ (సుమారు రూ. 14.84 కోట్లు) చెల్లించి కొనుగోలు చేసినట్లు ర్యాలీ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు వేలంలో అమ్ముడైన వీడియో గేమ్‌లలో ఇదే అత్యధిక ధర. గతేడాది సూపర్ మారియో బ్రోస్‌ 3 అనే వీడియో గేమ్‌ను 1.56 మిలియన్ డాలర్లుకు అమ్ముడైంది. ఆ రికార్డును ఇప్పుడు సూపర్ మారియో బ్రోస్‌ దాటేసింది. ఇప్పటికే సూపర్‌ మారియో సిరిస్‌లోని క్లాసిక్ గేమ్స్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి. అయితే ఈ వీడియో గేమ్‌ అమ్మకం ఇతర వీడియో గేమ్‌ అమ్మకాలకు భిన్నంగా సాగింది. 

ఈ వీడియో గేమ్‌ ప్యాక్‌ను తొలుత ర్యాలీ అనే ఈక్విటీ షేర్ ట్రేడింగ్ సంస్థ 1,40,000 డాలర్లకు గతేడాది ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది. ఈ సంస్థ పురాతన వస్తువులను సేకరించి వాటిని పెట్టుబడులు పెట్టగలిగే చిన్న కంపెనీలుగా మారుస్తుంది. అలా ఇన్వెస్టర్లు ఆయా కంపెనీలలో షేర్లు కొనేలా చేస్తుంది. గతంలో కూడా ఈ సంస్థ పాత కామిక్ బుక్స్, వీడియో గేమ్‌లను కొనుగోలు చేసింది. ఒకవేళ తాము కంపెనీగా మార్చిన వస్తువును ఎవరైనా ఎక్కువ మొత్తం ఇచ్చి చెల్లించేందుకు ముందుకు వచ్చినప్పుడు వాటిలో షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు అంగీకరిస్తే వాటిని విక్రయిస్తుంది. ప్రస్తుతం ఈ పద్ధతిలోనే సూపర్ మారియో బ్రోస్‌ గేమ్‌ను 2 మిలియన్ డాలర్ల ధరకు విక్రయించింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న