WhatsApp: ఓటీపీ ఇబ్బందులు లేకుండా...
close

Published : 23/05/2021 17:53 IST
WhatsApp: ఓటీపీ ఇబ్బందులు లేకుండా...

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత... యాక్టివేషన్‌ కోసం ఓటీపీ అడుగుతుంది. ఒక్కోసారి ఓటీపీ వేగంగా రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. దీంతో కాల్‌ ద్వారా ఓటీపీ తీసుకుంటుంటారు. అయితే ఈ రెండు ఆప్షన్ల వల్ల  ఓ సమస్య వచ్చి పడింది. మొబైల్‌లో ఆ సిమ్‌ లేకపోయినా... వాట్సాప్‌ యాక్టివేషన్‌ చేసేయొచ్చు. ఆ మొబైల్‌కు వచ్చిన ఓటీపీతో వేరే మొబైల్‌లో యాక్టివేట్‌ చేసి లాగిన్‌ అయిపోతున్నారు. ఈ ఆప్షన్‌ వల్ల  వాట్సాప్‌ స్కామ్‌లు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనిపై వాట్సాప్‌ దృష్టిసారించిందట. ఓటీపీల సమస్య లేకుండా చూస్తోందట. 

వాట్సాప్‌లో లాగిన్‌ అవ్వడానికి మొబైల్‌ నెంబరు ఇచ్చాక... మీ మొబైల్‌కి ఓ కాల్‌ వస్తుంది. దాన్ని మీరు అటెండ్‌ చేయక్కర్లేదు. కాల్‌ కనెక్ట్‌ అయ్యి... ఆటోమేటిక్‌గా డిస్‌ కనెక్ట్‌ అయిపోతుంది. దాంతో వాట్సాప్‌ యాక్టివేట్‌/ లాగిన్‌ అయిపోతుంది. ఈ విధానాన్ని ఫ్లాష్‌ కాల్‌ అంటారు. ఇలాంటి ఫీచర్‌ ఎక్కడో చూసినట్లుంది కదా. ట్రూకాలర్‌ లాగిన్‌ ఇలానే జరుగుతుంటుంది. ఆ విషయం పక్కనపెడితే ఓటీపీల స్కామ్‌ను తట్టుకోవడానికి వాట్సాప్‌ ఈ ఫ్లాష్‌ కాల్‌ విధానాన్ని వాడబోతోంది. ప్రస్తుతం దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయట. త్వరలో ప్రయోగాత్మకంగా బీటా వెర్షన్‌ యూజర్లకు అందిస్తారని భోగట్టా. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న