Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖమ్మం కార్పొరేషన్‌: నగరంలోని బురాన్‌పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక గుత్తేదారు సింహారెడ్డి కంచాలు, పాఠశాలకు అవసరమైన ఫ్యాన్‌లు వితరణగా అందజేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు బలోపేతం చేసేందుకు స్థానికులు ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు.  ఇటీవల ఎన్‌ఎస్టీ క్యాంప్‌ ఆవరణలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో నిద్రిస్తున్న విద్యార్థులను కాపాడిన స్థానిక యువకులను ఘనంగా సన్మానించారు. వీరికి సంక్షేమ శాఖ తరపున అవసరమైన సహాయం అందిస్తామని డీడీ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ ఎస్‌.రమ, ప్రధానోపాధ్యాయులు శంకర్‌రావు, మధు తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన