TS SSC Hall tickets: తెలంగాణ టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి.

Updated : 07 Mar 2024 17:24 IST

Telangana SSC Exams | హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు (TS SSC Hall tickets) విడుదలయ్యాయి. విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. పదో తరగతి రెగ్యులర్‌/ప్రైవేటు/ఓఎస్‌ఎస్‌సీ/ఒకేషనల్‌ విద్యార్థులు తమ Hall tickets పొందేందుకు జిల్లా పేరు, స్కూల్‌, పేరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే ఈ పరీక్షలను ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని