TS News: బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశానికి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం(JNAFAU)నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 11 Jul 2023 21:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశానికి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (JNAFAU)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణలోని పది కళాశాలల్లో 830 బీఆర్క్‌ సీట్ల భర్తీకి బుధవారం నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. ఈ నెల 23 నుంచి 31వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఆగస్టు 5,6 తేదీల్లో బీఆర్క్‌ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన అధికారులు.. ఆగస్టు 8న ఈ సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. మిగిలిన సీట్లకు ఆగస్టు 13, 14 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించి ఆగస్టు 16న రెండో విడత బీఆర్క్‌ సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 16న స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేసి సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని