GATE 2024 Key: గేట్‌ 2024 ఫైనల్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

గేట్‌ 2024 ఫైనల్‌ కీ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం ఫలితాలు శనివారం విడుదల కావాల్సి ఉంది.

Published : 15 Mar 2024 15:05 IST

బెంగళూరు: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2024) పరీక్ష తుది కీ విడుదలైంది.  ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా 200 నగరాల్లో రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగళూరు(IISc)  నిర్వహించిన విషయం తెలిసిందే. గత నెలలో రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు.. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, తుది కీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచారు. షెడ్యూల్‌ ప్రకారం.. గేట్‌ పరీక్షల ఫలితాలు మార్చి 16న ప్రకటించాల్సి ఉంది. 

తుది కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు