క్రీడా శిక్షణలో కెరియర్‌!

క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, శిక్షకులుగా రాణించాలని ఆశించేవారు నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఈ సంస్థ యూజీ, పీజీల్లో వివిధ క్రీడా కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది

Updated : 28 Jun 2023 03:38 IST

స్పోర్ట్స్‌ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన  

క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, శిక్షకులుగా రాణించాలని ఆశించేవారు నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఈ సంస్థ యూజీ, పీజీల్లో వివిధ క్రీడా కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. రాత పరీక్ష, ఫిట్‌నెస్‌ టెస్టులు, గేమ్‌ ప్రొఫిషియన్సీ, క్రీడల్లో నైపుణ్యం, వైవాల్లోని ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. 

ప్రత్యేకమైన చదువుల నిమిత్తం విభాగాలవారీ సంబంధిత సంస్థలను జాతీయ స్థాయిలో నెలకొల్పారు. అదే తరహాలో క్రీడలు, వాటి శిక్షణలో రాణించడానికి కేంద్ర యువజన, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంఫాల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ   (ఎన్‌ఎస్‌యూ) 2018లో ప్రారంభమైంది. దీనికి కేంద్రీయ విశ్వవిద్యాలయ హోదా కల్పించారు. ఇప్పుడు దీన్ని ప్రపంచ సంస్థగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం కాన్‌బెర్రా, విక్టోరియా యూనివర్సిటీలు-ఆస్ట్రేలియా, రష్యన్‌ ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ యూనివర్సిటీ-రష్యాలతో జోడీ కట్టింది. క్రీడలకు సంబంధించి విద్య, పరిశోధన, శిక్షణల్లో ఆధునికత దిశగా అడుగులేస్తోంది. ప్రతి కోర్సులోనూ 30 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు.


ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌

(అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌)
వ్యవధి: రెండేళ్లు సీట్లు: 20

అర్హత: డిగ్రీతోపాటు స్పోర్ట్స్‌ కోచింగ్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌.. వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌, వైవాతో అవకాశం కల్పిస్తారు. పరీక్షకు 100, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు 20, గేమ్‌ ప్రొఫిషియన్సీకి 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌కి 30, వైవాకు 20 మార్కులు ఉంటాయి. పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, స్పోర్ట్స్‌ సైన్స్‌ 40, అభ్యర్థి ఎంచుకున్న స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌లో 40 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.
వ్యవధి 2 గంటలు.  
కెరియర్‌: స్పోర్ట్స్‌ కోచ్‌లకు వారి నైపుణ్యాలను అనుసరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో డిమాండ్‌ ఉంది. వీరు పాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో సంబంధిత క్రీడా శిక్షకులుగా రాణించవవచ్చు. ఫిట్‌నెస్‌ సెంటర్లలో మేనేజర్‌గానూ ఎదగవచ్చు. ప్రైవేటు క్రీడా కేంద్రాల్లో స్పోర్ట్స్‌ కోచ్‌గా అవకాశాలు అందుకోవచ్చు.


ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజీ

వ్యవధి: రెండేళ్లు సీట్లు: 15
అర్హత: 50 శాతం మార్కులతో బీపీఎడ్‌ లేదా బీఏ సైకాలజీ/ స్పోర్ట్స్‌ సైకాలజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రీడల్లో ప్రాతినిధ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ప్రవేశం: పరీక్ష, వైవా, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్షకు వంద, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌కి 30, వైవాకు 20 మార్కులు ఉంటాయి. పరీక్షలో స్పోర్ట్స్‌ అవేర్‌నెస్‌ 10, రీజనింగ్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, సైకాలజీ/స్పోర్ట్స్‌ సైకాలజీకి 70 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు.
కెరియర్‌: వీరు క్రీడాకారులకు మెంటర్‌గా వ్యవహరించవచ్చు. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, లక్ష్యం దిశగా అడుగులు పడేలా ప్రోత్సహించేది వీరే. ప్రభుత్వ, ప్రైవేటు స్పోర్ట్స్‌ అకాడమీలు, శిక్షణ కేంద్రాల్లో అవకాశాలుంటాయి.


బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌

వ్యవధి: నాలుగేళ్లు. వీరికి ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌, హాకీ, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ల్లో శిక్షణ అందిస్తారు. సీట్లు: 50
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఏదైనా క్రీడలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండాలి.
ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌లో 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 40, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్‌కి 30 మార్కులు కేటాయించారు.
కెరియర్‌: వీరు జాతీయ సంస్థలు, ప్రైవేటు క్లబ్‌లు, పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో కోచ్‌, కోచింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలు అందించవచ్చు.


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ & స్పోర్ట్స్‌ (బీపీఈఎస్‌)

వ్యవధి: మూడేళ్లు. సీట్లు: 50
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఏదైనా క్రీడలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండాలి.
ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌లో 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 40, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్‌కి 30 మార్కులు కేటాయించారు.  
కెరియర్‌: వీరు పాఠశాలలు, కళాశాల్లలో వ్యాయమ ఉపాధ్యాయులగా రాణించవచ్చు. ఫిట్‌నెస్‌ క్లబ్బులు, హెల్త్‌ క్లబ్బుల్లో సేవలు అందించవచ్చు. స్పోర్ట్స్‌ సెంటర్లలో కోచ్‌ గానూ కొనసాగవచ్చు.


స్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ (ఎంపీఈఎస్‌)

వ్యవధి: రెండేళ్లు సీట్లు: 30
అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ (బీపీఈఎస్‌) లేదా సమాన స్థాయి కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.  
ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, గేమ్‌ ప్రొఫిషియన్సీ, వైవాలతో. పరీక్షకు వంద మార్కులు. ఇందులో స్పోర్ట్స్‌ అవేర్‌నెస్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ 60, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ 20 మార్కులకు.ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 20, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ 30, వైవా 20 మార్కులకు ఉంటాయి.  
కెరియర్‌: వీరు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో స్పోర్ట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా రాణించవచ్చు. ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఆతిథ్యరంగం, హెల్త్‌ క్లబ్బుల్లోనూ అవకాశాలుంటాయి. పర్సనల్‌ ట్రైనర్లు, కోచ్‌లు, ఇన్‌స్ట్రర్ల్లుగా రాణించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని