సామాజిక మాధ్యమాలతోనూ మేటి కెరియర్!
‘ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటావ్.. కాస్త పుస్తకాలు తీసి చదవొచ్చు కదా!’.. విద్యార్థులున్న ఇళ్లల్లో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాను కేవలం కాలక్షేపం కోసమే కాదు.. చదువు కోసం, చక్కటి కెరియర్‌ను నిర్మించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.
‘ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటావ్.. కాస్త పుస్తకాలు తీసి చదవొచ్చు కదా!’.. విద్యార్థులున్న ఇళ్లల్లో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాను కేవలం కాలక్షేపం కోసమే కాదు.. చదువు కోసం, చక్కటి కెరియర్‌ను నిర్మించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ఖాతాలు లేకపోతే మంచి మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది! మరి వీటిని ఎలా ఉపయోగిస్తే ఇవన్నీ చేయొచ్చో ఇవాళ తెలుసుకుందామా..? తెలుసుకున్నాక ఎవరైనా ‘ఎప్పుడూ ఫోనేనా’ అని ప్రశ్నిస్తే.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీరూ చెప్పొచ్చు!
ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సబ్జెక్టులకు సంబంధించిన ఎంతో సమాచారం, విలువైన మెటీరియల్, లైవ్ తరగతులు, వీడియోలు దొరుకుతున్నాయి. పుస్తకాల్లో లభించేదానికి అదనంగా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. వీటిని సేకరించేందుకు, స్నేహితులతో పంచుకుంటూ కలిసి చదువుకునేందుకు సోషల్ మీడియా ఖాతాలను వినియోగించుకోవచ్చు. ‘కొలాబరేటివ్ లెర్నింగ్’కు ఇవి సమర్థంగా ఉపయోగపడతాయి. బృందంగా నేర్చుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల విద్యార్థుల్లో ‘టీమ్ వర్క్ స్కిల్స్’ మెరుగవుతాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది. ఇది వారి నైపుణ్యాభివృద్ధికీ తోడ్పడుతుంది.
చుట్టూ ఏం జరుగుతుందో..
ఇప్పుడు నేర్చుకోవడంలో ఎటువంటి భాషాభేదాలు, స్థానికత సమస్యలు లేవు. విద్యార్థుల ఆలోచనలు ప్రపంచస్థాయికి ఎదుగుతున్నాయి. ‘గ్లోబల్ ఎక్స్‌పోజర్’ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా విభిన్న సంస్కృతులను, విస్తృతమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. దేశాల మధ్య వారధుల్లా పనిచేస్తూ భౌగోళిక పరిమితులను చెరిపేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమ ఆలోచనాస్థాయిని, పరిధిని పెంచుకునేందుకు విద్యార్థులకు ఇదో చక్కని మార్గం. వివిధ దేశాల్లో ఉండే పోటీలు, దొరికే స్కాలర్‌షిప్‌లు, ఉన్నతవిద్యా మార్గాలు, అక్కడి జీవనవిధానం.. ఇలా అన్నింటిపైనా అవగాహన పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.
సమాచారానికి..
ఏ కాలేజీ, ఏ కోర్సు, ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్ని అయినా.. వీటి ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు, పరిశ్రమలు, రంగాలకు సంబంధించి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. అందులో పనిచేసే నిపుణులు, ఆ రంగంపై ఆసక్తి - అనుభవం ఉన్నవారు కూడా ఎప్పటికప్పుడు తమకు తెలిసిన సమాచారాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇటువంటి ఖాతాలను అనుసరించడం ద్వారా కావాల్సిన వివరాలు తెలుసుకోవడంతోపాటు కొత్తగా వస్తున్న మార్పులను గమనించే వీలు కలుగుతుంది. సమాచారం కోసం ప్రత్యేకంగా ప్రతిసారీ వెతుక్కోకుండా తనంతట తానే వచ్చేలా చేసేందుకు సోషల్ మీడియా చక్కని సాధనం.
సందేహాల నివృత్తికి..
సబ్జెక్టులో అయినా.. ఆసక్తి ఉన్న రంగంలోనైనా సందేహాలు వచ్చినప్పుడు అన్నివేళలా సంతృప్తికరమైన సమాధానాలు దొరక్కపోవచ్చు. అటువంటి సమయంలో చాలామంది విద్యార్థులు గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో విద్యార్థులు నిర్వహించుకునే గ్రూప్స్, కమ్యూనిటీల ద్వారా చర్చల్లో ఈ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంస్కృతి ఇటీవల మరింత పెరిగింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు అధికంగా ఈ పద్ధతి అనుసరిస్తున్నారు. అయితే దీన్ని అకడమిక్ తరగతులకు కూడా వర్తింపజేసుకోవడం ద్వారా సబ్జెక్టు మరింత నేర్చుకునే వీలుంటుంది.
పరిచయాలకు..
అధ్యాపకులు, విద్యార్థులు, క్యాంపస్‌లో ఇతర కోర్సుల వారు, అందరితోనూ పరిచయాలు కొనసాగించడం కెరియర్ ఆరంభంలో అవసరమవుతుంది. ఎవరి నుంచి ఎటువంటి ముఖ్య సమాచారం లభిస్తుందో, ఎవరు ఏ సందర్భంలో ఎలా సాయపడగలరో మనకు తెలియదు. అందువల్ల వీలైనంత ఎక్కువమందితో అనుసంధానమై ఉండటం ‘నెట్‌వర్కింగ్’కు ఉపకరిస్తుంది. అదే విధంగా కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణలోనూ, కెరియర్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలోనూ ఇలా ఏర్పడే పరిచయాలు తోడ్పడగలవు.
స్ఫూర్తిమంతంగా..
అకడమిక్‌లో అయినా, పోటీ పరీక్షల్లో అయినా చాలాసార్లు నిరాశగా ఫీలయ్యే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు సోషల్‌మీడియాలో కనిపించే ఏదో ఒక పోస్టో, ఏదో ఒక సక్సెస్ స్టోరీనో మనల్ని ఆ బాధలోంచి బయటపడేయొచ్చు. మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రోత్సహించవచ్చు. వివిధ పరీక్షల్లో విజయం సాధించిన వారి స్ఫూర్తిగాథలు చదవడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడి సమస్యలను సాధించిన వారి గురించి తెలుసుకోవడం ద్వారా నిరంతరం స్ఫూర్తి పొందుతూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండొచ్చు. ఒత్తిడి అధికమైపోతున్న ఈ కాలంలో ఇది అవసరం కూడా.
అందిపుచ్చుకునేలా..
సామాజిక మాధ్యమాల ద్వారా తాము వెళ్లాలనుకుంటున్న రంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కాదు.. ‘సెల్ఫ్ మార్కెటింగ్’కూ అవకాశాలుంటాయి. విద్యార్థి తన బలాలు, విజయాలు, లక్ష్యాలు.. ఇలా అన్నింటినీ తెలియజేస్తూ ఒక స్థిరమైన ప్రొఫైల్‌ను తయారుచేసుకోవడం ద్వారా కెరియర్‌లో మరింత ముందుకెళ్లే అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్లవుతారు.
కంటెంట్..
ఇప్పటికే చాలా మంది అధ్యాపకులు, విద్యార్థులు సొంతంగానూ, వివిధ సంస్థల ద్వారా చదువుకు సంబంధించిన ఎన్నో అంశాలపై సొంతంగా కంటెంట్ సృష్టిస్తున్నారు. ఇలాంటి ‘యూజర్ జనరేటెడ్ కంటెంట్’ లక్షల మంది విద్యార్థులను ఆకర్షించడమే కాదు.. వారిని ఈ ప్రక్రియలో మరింతగా ఎంగేజ్ చేస్తోంది. ఇటువంటి కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు.
జాగ్రత్తగా..
- అయితే ఇలా సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు విద్యార్థులు ప్రొఫెషనల్‌గా ఉంటూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
- ఫేక్ సమస్య అదీ ఇదీ అని లేకుండా అన్ని రంగాలకూ ఉంటుంది. నకిలీ ఖాతాలు, అబద్ధపు సమాచారం బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.
- ప్రవర్తనాపరమైన జాగ్రత్తలూ తప్పనిసరి. ఏది ఎంతవరకూ అవసరమో అంతవరకే స్పందించడం, అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడటంతో లేనిపోని ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
- సమయపాలన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సామాజిక మాధ్యమాల్లో ఎంతసేపు గడుపుతున్నాం, ఏం చేశాం అన్నదానిపై మెలకువతో వ్యవహరించాలి.
...చివరిగా, నేటి సమాజంలో సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా బతకడం అంత తేలిక కాదు. అలాగే అన్ని వేళలా అంత అవసరం కూడా లేదు. దాన్ని ఎంతవరకూ, దేని కోసం వినియోగిస్తున్నాం అనే అంశమే ప్రధానం. పరీక్షలూ ఇంటర్వ్యూల సమయంలో పక్కన పెట్టేసినా మిగతా కాలంలో దీన్ని మితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడం ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్‌గా నిలిచి.. రణ్‌బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్‌గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?