నోటిఫికేషన్స్‌

ఎన్‌ఎండీసీలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు

Updated : 03 Jan 2024 22:29 IST

ఉద్యోగాలు

ఎన్‌ఎండీసీలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు

ఎన్‌ఎండీసీ అపోలో సెంట్రల్‌ హాస్పిటల్‌ కింది పోస్టుల భర్తీకి రెగ్యులర్‌, ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

1. స్పెషలిస్ట్‌ (ఆర్థోపెడిక్‌)
2. స్పెషలిస్ట్‌ (ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ)
3. స్పెషలిస్ట్‌ (మెడిసిన్‌) 4. స్పెషలిస్ట్‌ (అనస్థీషియాలజీ)
5. స్పెషలిస్ట్‌ (రేడియాలజీ) 6. జీడీఎంవో
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఏ, డీఎంఆర్‌డీ, డీ (ఆర్థో) వీటితో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 55 ఏళ్లు మించరాదు
ఇంటర్వ్యూలు : 5-01-2024న అపోలో హెల్త్‌ సిటీ అరిలోవ, చినగడలి, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌)
07-01-2024న ఎన్‌ఎండీసీ ఆఫీస్‌(జీఈసీ) బొర్రియకల, షెజ్బహర్‌, రాయ్‌పూర్‌ (చత్తీస్‌గఢ్‌)
వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/


సీఎస్‌ఐఆర్‌లో 12 సైంటిస్ట్‌లు

సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సెరామిక్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌) 12 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సైన్స్‌/ ఇంజినీరింగ్‌, సెరామిక్‌ ఇంజినీరింగ్‌/ సెరామిక్‌ టెక్నాలజీ/ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌/ మెటీరియల్స్‌ సైన్స్‌/ మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరిగ్‌/ ఫిజిక్స్‌ విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్‌.
వయసు: 32 ఏళ్లు మించరాదు
దరఖాస్తు ఫీజు: రూ. 500
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-01-2024
వెబ్‌సైట్‌: https://www.cgcri.res.in/


ఐటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భాస్కరాచార్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ అండ్‌ జియో-ఇన్ఫర్మేటిక్స్‌ (బీఐఎస్‌ఏజీ-ఎన్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఐటీ ఎగ్జిక్యూటీవ్‌: 54 ఖాళీలు
అర్హత: బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ బీసీఏ
దరఖాస్తుకు చివరి తేదీ: 12-01-2024
దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా
వెబ్‌సైట్‌: https://bisag-n.gov.in/


వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పంద ప్రాతిపదికన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ ఖాళీలను భర్తీ చేస్తోంది.
అర్హత: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌. లేదా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ.
వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, బీసీ అభ్యర్థులకు రూ.100.


కడప జోన్‌లో...

కడప జోన్‌-4లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌)లో 32 కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ ఖాళీల భర్తీకి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
జోన్‌-4 కడప పరిధిలోని జిల్లాలు: కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, ఓల్డ్‌ రిమ్స్‌, కడప’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2024. కౌన్సెలింగ్‌ తేదీ: 14.02.2024.
వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


గుంటూరు జోన్‌లో..  

గుంటూరు జోన్‌-3లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌)లో 15 కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) ఖాళీల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
జోన్‌-3 గుంటూరు పరిధిలోని జిల్లాలు: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక, గుంటూరు చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2024. కౌన్సెలింగ్‌ తేదీ: 14.02.2024.
వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


రాజమహేంద్రవరం జోన్‌లో..

రాజమహేంద్రవరం జోన్‌-2లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌)లో 15 కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) ఖాళీల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, ఓల్డ్‌ రిమ్స్‌, కడప చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2024.
కౌన్సెలింగ్‌ తేదీ: 14.02.2024.
వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


విశాఖపట్నం జోన్‌లో..

విశాఖపట్నం జోన్‌-1 పరిధిలోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌(ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌)లో 8 కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) ఖాళీల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
దరఖాస్తు: దరఖాస్తులను గూగుల్‌ ఫాం ద్వారా పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2024.
కౌన్సెలింగ్‌ తేదీ: 14.02.2024.
 వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని