క్రోనో వర్కింగ్‌.. కొత్త పద్ధతి!

కరోనా విజృంభణ తర్వాత ఉద్యోగుల పనితీరులో చాలా మార్పులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, హైబ్రిడ్‌ వర్కింగ్‌.. ఇటువంటి పదాలన్నీ చాలా అలవాటయిపోయాయి.

Published : 13 Mar 2024 00:05 IST

రోనా విజృంభణ తర్వాత ఉద్యోగుల పనితీరులో చాలా మార్పులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, హైబ్రిడ్‌ వర్కింగ్‌.. ఇటువంటి పదాలన్నీ చాలా అలవాటయిపోయాయి. ఇప్పుడు అదే కోవలో మరో కొత్తపద్ధతి తెరమీదకొచ్చింది.. అదే క్రోనో వర్కింగ్‌! అంటే ఉద్యోగులు కంపెనీలు నిర్దేశించిన సమయాల్లో కాకుండా తమకు అనుకూలమైన, నచ్చిన సమయంలో నిర్దేశించిన పని గంటలు పనిచేయడం. ఇలా చేయడం ద్వారా ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతోందని సంస్థలు విశ్వసిస్తున్నాయి.

కొందరు రాత్రుళ్లు చాలా ఉత్సాహంగా ఉంటూ బాగా ఆలోచించగలుగుతారు. మరికొందరు తెల్లవారుజామున ప్రశాంతంగా పని చేయడానికి ఇష్టపడతారు. మరికొందరేమో పగలు అందరిలా సాధారణ పనివేళలు కావాలని కోరుకుంటారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన అనుకూల వేళలంటూ ఉంటాయి. వారి అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకునేలా అవకాశం ఇవ్వడం ద్వారా కంపెనీలకు ఉద్యోగులు మరింత విశ్వాసపాత్రులుగా ఉంటారని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. సంస్థ, ఉద్యోగి మధ్య దీర్ఘకాల అనుబంధం కొనసాగేలా ఇది పనికొస్తుందని, ముఖ్యంగా మహిళలు, కుటుంబ బాధ్యతల్లో ఉండేవారు ఉద్యోగాలను విడిచిపెట్టాల్సిన పరిస్థితి రాదని చెబుతున్నాయి. ఈ వెసులుబాటు అన్నిచోట్లా అమల్లోకి వస్తే నిర్ణీత ఎనిమిది గంటల పని సమయాన్ని రోజు మొత్తంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచుకోవచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని