న్యాయస్థానాల్లో నియామకాలు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టులు, జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసెస్‌ విభాగంలో 592 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ అర్హతలున్న అభ్యర్థులు వీటికి పోటీపడొచ్చు.

Published : 09 Mar 2022 00:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టులు, జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసెస్‌ విభాగంలో 592 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ అర్హతలున్న అభ్యర్థులు వీటికి పోటీపడొచ్చు.
ప్రకటించిన పోస్టుల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ప్రాసెస్‌ సర్వర్‌ మొదలైనవి ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ పోస్టుల భర్తీకి హైకోర్టు పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్ష విధానాన్ని హైకోర్ట్‌ వెబ్‌సైట్‌ (http://tshc.gov.in) లో చూడొచ్చు. లేదా డిస్ట్రిక్ట్‌ కోర్టుల వెబ్‌సైట్లలోనూ (districts.ecourts.gov.in/telangana) చూడొచ్చు.
స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3: 64 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ (నిమిషానికి 45 పదాలు), షార్ట్‌ హ్యాండ్‌ హయ్యర్‌గ్రేడ్‌ (నిమిషానికి 120 పదాలు) పాసై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 అభ్యర్థి నియామక సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. అదనపు అకడమిక్‌, టెక్నికల్‌ అర్హతలున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 50 ప్రశ్నలు (జనరల్‌ నాలెడ్జ్‌-25, జనరల్‌ ఇంగ్లిష్‌-25) ఉంటాయి. ఆన్‌లైన్‌ పరీక్ష కాలవ్యవధి గంట. స్కిల్‌టెస్ట్‌ 30 మార్కులకు, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
జూనియర్‌ అసిస్టెంట్‌: 173 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
టైపిస్టు: 104 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, టైప్‌ రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ పాసై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. రాతపరీక్షకు 50 మార్కులు, టైప్‌టెస్ట్‌కు 30, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌: డిగ్రీ పాసై ఉండాలి. 39 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
ఎగ్జామినర్‌: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. మొత్తం 43 ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
కాపీయిస్ట్‌: మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ పాసై ఉండాలి. రాతపరీక్షకు 50 మార్కులు, టైప్‌టెస్ట్‌కు 30, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
రికార్డ్‌ అసిస్టెంట్‌: మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
ప్రాసెస్‌ సర్వర్‌: పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. మొత్తం 63 ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 18-34 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుక వెనుకబడి వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయఃపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.


అర్హత మార్కులు: రాత పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాలి. స్కిల్‌ టెస్ట్‌లో ఓసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాలి.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. దీంట్లో అర్హత సాధించినవారు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలోనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.  

రిజర్వేషన్లు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌ పర్సన్స్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. సంబంధిత జిల్లాలకు చెందిన స్థానిక అభ్యర్థులకు 95 శాతం పోస్టులను రిజర్వు చేస్తారు. ఇతరులకు 5 శాతం పోస్టులను కేటాయిస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 04.04.22
వెబ్‌సైట్‌: http://tshc.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని