బీఆర్‌ఓలో 302 పోస్టులు

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 11 Apr 2022 06:29 IST

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌ (జీఆర్‌ఈఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 302 పోస్టులు-ఖాళీలు: మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (మాసన్‌)-147, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (నర్సింగ్‌ అసిస్టెంట్‌)-155 వెబ్‌సైట్‌: http://bro.gov.in/

యూపీఎస్సీ - 11 పోస్టులు

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11 పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ఇంజినీర్లు-05, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు-02, లెక్చరర్‌-01, అసిస్టెంట్‌ డైరెక్టర్‌-03. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 28. వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ప్రవేశాలు

ఎన్‌టీఏ - నీట్‌(యూజీ): నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)...నీట్‌ (యూజీ) 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

* నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (యూజీ)-2022 

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 07. పరీక్ష తేది: 2022, జులై 17. వెబ్‌సైట్‌: https://neet.nta.nic.in/ 

ఏపీ పాలీసెట్‌-2022: విజయవాడలోని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌)-2022

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2022లో ఏప్రిల్‌/మే నెలల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 11.

దరఖాస్తులకు చివరితేది: 2022, మే 18. పరీక్ష తేది: 2022, మే 29.

వెబ్‌సైట్‌: http://sbtetap.gov.in/

నాటా-2022: ది కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నాటా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఐదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌)లో ప్రవేశాలు కల్పిస్తారు.

* నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా) 2022

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/ డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఈ పరీక్షను మూడు విడతల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

1) నాటా ఫస్ట్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 23. పరీక్ష తేది: 2022, జూన్‌ 12.

2) నాటా రెండో టెస్ట్‌ షెడ్యూల్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 20. పరీక్ష తేది: 2022, జులై 03.

3) నాటా మూడో టెస్ట్‌ షెడ్యూల్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 11.

పరీక్ష తేది: 2022, జులై 24.

వెబ్‌సైట్‌: www.nata.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని