Updated : 12 Jun 2022 18:02 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌

ఆర్కే పురంలో....

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికిందరాబాద్‌ (ఆర్కే పురం)లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీఎస్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 45. పోస్టులు-ఖాళీలు: పీజీటీ-07, టీజీటీ-20, పీఆర్‌టీ-18.

సబ్జెక్టులు: సైకాలజీ, కామర్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, జాగ్రఫీ, సోషల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తో పాటు డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 06.

చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, ఆర్కే పురం, సికిందరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://apsrkpuram.edu.in/


సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: టెక్నికల్‌ అసోసియేట్లు, ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి డీఎంఎల్‌టీ, బీఎస్సీ/ డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ/ ఎండీ/ ఎంఎస్‌ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌/ గేట్‌ అర్హత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జూన్‌ 20.

వెబ్‌సైట్‌: ‌www.cdfd.org.in/


ప్రవేశాలు

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) 2022-23 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అందిస్తున్న కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌

విభాగాలు: అప్లైడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, యానిమేషన్‌, ఫొటోగ్రఫీ, ఇంటీరియర్‌ డిజైన్‌.

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఏడీఈఈ) ఆధారంగా.

పరీక్ష తేదీలు: 2022, జులై 02, 03.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 20.

వెబ్‌సైట్‌: https://jnafauadmissions.com/


ఎన్‌ఐఎల్‌డీ-సెట్‌ 2022

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగ్‌జన్‌ విభాగ అనుబంధ సంస్థల్లో 2022 విద్యాసంవత్సరానికి బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ ప్రకటన విడుదలైంది.

అందిస్తున్న కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీఓటీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీఓ).

ప్రవేశాలు కల్పిస్తున్న సంస్థలు: ఎన్‌ఐఎల్‌డీ కోల్‌కతా, ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌ ఒడిషా, ఎన్‌ఐఈపీఎండీ చెన్నై, పీడీయూఎన్‌ఐపీపీడీ న్యూదిల్లీ.

అర్హత: ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష  ఆధారంగా. రాతపరీక్ష తేది: 2022, జులై 24.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: 2022, జూన్‌ 25.

వెబ్‌సైట్‌: http://niohkol.nic.in/


ఏపీ- స్పోర్ట్స్‌ విద్యాలయాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తాడేపల్లి (గుంటూరు)లోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2022-2023 విద్యాసంవత్సరానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్పోర్ట్స్‌ విద్యాలయాల్లో జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. క్రీడల్లో అనుభవంతో పాటు ఆసక్తి ఉండాలి.

అందిస్తున్న కళాశాలలు: పాలసానిపల్లి (బాలికలు), పెదవేగి (బాలురు).

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 26.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 30.

వెబ్‌సైట్‌: https://apgpcet.apcfss.in/


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts