నోటిఫికేషన్స్‌

కొచ్చి (కేరళ)లోని ది ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 12 Jul 2022 00:59 IST

ఫ్యాక్ట్‌లో 137 పోస్టులు

కొచ్చి (కేరళ)లోని ది ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 137. సీనియర్‌ మేనేజర్లు-09, ఆఫీసర్లు-08, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు-58, టెక్నీషియన్లు-62. విభాగాలు: మెటీరియల్స్, క్వాలిటీ అస్యూరెన్స్, కెమికల్, ఎలక్ట్రికల్, హెచ్‌ఆర్, మెకానికల్, సివిల్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 29. https://fact.co.in/


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) సదరన్‌ రీజియన్‌ (తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్‌ ఆపరేటర్లు (ఏవియేషన్‌) గ్రేడ్‌-1
మొత్తం పోస్టులు: 39 అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత, డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి. వయసు: 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ ప్రొఫిషియన్సీ ఫిజికల్‌ టెస్ట్‌ (డ్రైవింగ్‌ టెస్ట్‌) ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 29.

వెబ్‌సైట్‌: https://iocl.com/


ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌లో 38 పోస్టులు

భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 38. రిసెర్చ్‌ ఆఫీసర్లు (ఆయుర్వేద)-04, ఫార్మసిస్టులు-25, పంచకర్మ టెక్నీషియన్లు-08, రిసెర్చ్‌ ఆఫీసర్‌ (ఐటీ)-01. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత, అనుభవం. 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 15. 

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 14. 

వెబ్‌సైట్‌:/www.ccras.nic.in/


జీఆర్‌ఎస్‌ఈలో 58 ఉద్యోగాలు

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎస్‌ఈ) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 58. సూపర్‌వైజర్లు, ఇంజిన్‌ టెక్నీషియన్లు, డిజైన్‌ అసిస్టెంట్లు. విభాగాలు: ఐటీ, ఫైనాన్స్, లీగల్, మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింట్‌ టెక్నాలజీ, సివిల్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 28.

వెబ్‌సైట్‌: https://grse.in/


యూపీఎస్సీలో 10 పోస్టులు

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 10. ఆపరేషన్స్‌ ఆఫీసర్లు-04, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-02, ట్యూటర్‌-01, అసిస్టెంట్‌ ఎడిటర్లు-03. అర్హతలు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 28. 

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని