Published : 19 Jul 2022 01:18 IST

నోటిఫికేషన్స్‌


ఉద్యోగాలు
షిప్పింగ్‌ కార్పొరేషన్‌లో...

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని ది షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ మేనేజర్లు

మొత్తం పోస్టులు: 46 విభాగాలు: మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, లా, ఫైర్‌ అండ్‌ సెక్యూరిటీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ/ ఎంఎంఎస్‌, కంపెనీ సెక్రెటరీ, సీఏ ఉత్తీర్ణత. అనుభవం.

వయసు: 01.05.2022 నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 16.

వెబ్‌సైట్‌: www.shipindia.com/


స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో....

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మసాజ్‌ థెరపిస్టులు

మొత్తం ఖాళీలు: 104

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు మసాజ్‌ థెరపీలో సర్టిఫికెట్‌ కోర్సు, స్పోర్ట్స్‌ ఫీల్డ్‌లో అనుభవం ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 06.

https://sportsauthorityofindia.nic.in/


వాక్‌ఇన్‌
సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఎంఎల్‌లో....

జంషెడ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 44. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేదీలు: 2022 ఆగస్టు 02 - 05 వరకు.

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఎంఎల్‌, బర్మామైన్స్‌, జంషెడ్‌పూర్‌.

వెబ్‌సైట్‌:www.nmlindia.org/


ప్రవేశాలు
ఎన్‌బీఈ - నీట్‌ (ఎస్‌ఎస్‌) 2022

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ 2022 విద్యాసంవత్సరానికి నీట్‌-ఎస్‌ఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు వివిధ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో (డీఎం/ ఎంసీహెచ్‌) ప్రవేశాలు కల్పిస్తారు.

* నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - సూపర్‌ స్పెషాలిటీ (నీట్‌-ఎస్‌ఎస్‌)

అర్హత: పీజీ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా. పరీక్ష తేదీలు: 2022, సెప్టెంబర్‌ 01, 02.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 04.

వెబ్‌సైట్‌: https://natboard.edu.in/


అప్రెంటిస్‌

జీఆర్‌ఎస్‌ఈలో 249 ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎస్‌ఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 249 విభాగాల వారీ: ట్రేడ్‌ అప్రెంటిస్‌లు-203, డిప్లొమా అప్రెంటిస్‌లు-30, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు-16.

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఆగస్టు 05.

వెబ్‌సైట్‌: https://grse.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts