నోటిఫికేషన్స్‌

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో జనవరి 2023 నుంచి ఆరంభమయ్యే ప్రత్యేక నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సుకు సంబంధించి

Published : 09 Aug 2022 01:14 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
నేవీలో ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్‌లు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో జనవరి 2023 నుంచి ఆరంభమయ్యే ప్రత్యేక నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సుకు సంబంధించి ఎస్‌ఎస్‌సీ- ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌)లో చేరేందుకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి భారత నౌకాదళం దరఖాస్తులు కోరుతోంది.

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 50 పోస్టులు

అర్హతలు: బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌/ సైబర్‌ సెక్యూరిటీ/ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌/ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌/ డేటా అనలిటిక్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌). లేదా ఎంసీఏ, బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణత.

వయసు: 02-01-1998-01-07-2003 మధ్య జన్మించినవారు అర్హులు.

ఎంపిక: డిగ్రీ, పీజీ మార్కులు, పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-08-2022.

వెబ్‌సైట్‌: https://joinindiannavy.gov.in/


షార్‌- స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగాలు

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌డీఎస్‌సీ షార్‌)... శ్రీహరికోట, సూళ్లూరుపేటలోని స్పేస్‌ సెంట్రల్‌ స్కూళ్లలో 19 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పీజీటీ: గణితం:02, ఫిజిక్స్‌: 01 బయాలజీ: 01 కెమిస్ట్రీ: 01 ఖాళీలు.

టీజీటీ: గణితం: 02, హిందీ: 02, ఇంగ్లిష్‌: 01 కెమిస్ట్రీ: 01, బయాలజీ: 01 పీఈటీ: 02 పోస్టులు.

ప్రైమరీ టీచర్‌: 05 పోస్టులు

అర్హత: పీజీటీలకు పీజీతోపాటు బీఎడ్‌, టీజీటీలకు యూజీతో బీఎడ్‌, పీఈటీలకు బీపీఈడీ, ప్రైమరీ టీచర్లకు డీఎడ్‌ ఉత్తీర్ణతతోపాటు ఇతర అర్హతలు ఉండాలి.

వయసు (28.08.2022 నాటికి): 18-40(పీజీటీ), 18-35(టీజీటీ), 18-30(పీటీ) సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28.08.2022.

వెబ్‌సైట్‌: https://apps.shar.gov.in/sdscshar/


459 పారా మెడికల్‌ పోస్టులు

మ్మడి తూర్పు గోదావరి జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 459
పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* అనస్తీషియా టెక్నీషియన్‌: 10 పోస్టులు * ఆడియో విజువల్‌ టెక్నీషియన్‌: 02 * ఆడియోమెట్రీ టెక్నీషియన్‌: 07 * బయో మెడికల్‌ టెక్నీషియన్‌: 03 * కౌన్సెలర్‌/ ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్‌-2: 01 * డెంటల్‌ టెక్నీషియన్‌: 01 * రేడియోగ్రాఫర్‌: 13 * ఈసీజీ టెక్నీషియన్‌: 07 * ఎలక్ట్రీషియన్‌: 10 * ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌: 10 * జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు: 105 * మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌/ అసిస్టెంట్స్‌: 08 * ల్యాబ్‌ అటెండెంట్‌: 43 * ల్యాబ్‌ టెక్నీషియన్‌: 102 * లైబ్రరీ అసిస్టెంట్‌: 08 * మార్చురీ అటెండెంట్‌: 16 * ఓటీ టెక్నీషియన్‌: 08 * ఆఫీస్‌ సబార్డినేట్‌: 25 * ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌/ రిఫ్రాక్షనిస్ట్‌: 07 * ఆప్టోమెట్రిస్ట్‌: 02 * ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2: 30 * ఫిజియోథెరపిస్ట్‌: 03 * ప్లంబర్‌: 08 * స్పీచ్‌ థెరపిస్ట్‌: 01 * స్టోర్‌ అటెండర్‌: 04 * శానిటరీ వర్కర్‌ కమ్‌ వాచ్‌మెన్‌: 05 * ఎఫ్‌ఎన్‌వో: 20 పోస్టులు

అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కాకినాడ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20.08.2022.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని