నోటిఫికేషన్స్‌

గ్రూప్‌-1 సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 92 పోస్టులు భర్తీ కానున్నాయి.

Updated : 03 Oct 2022 07:06 IST

ఉద్యోగాలు
92 గ్రూప్‌-1 ఉద్యోగాలు

గ్రూప్‌-1 సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 92 పోస్టులు భర్తీ కానున్నాయి.
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డివిజినల్‌/ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు బీఈ(ఫైర్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01/07/2022 నాటికి డిప్యుటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(సివిల్‌) పోస్టులకు 21-30 ఏళ్లు, డిప్యుటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్‌(మెన్‌) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజినల్‌/ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు 21-28 ఏళ్లు, మిగిలిన వాటికి 18 - 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.370.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 13/10/2022.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01/11/2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02/11/2022.
ప్రిలిమినరీ పరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌): 18/12/2022.
మెయిన్స్‌- రాత పరీక్ష (డిస్క్రిప్టివ్‌): మార్చి ద్వితీయార్ధం, 2023.
వెబ్‌సైట్‌: 
https://psc.ap.gov.in


అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్‌ సబార్డినేట్‌ సర్వీసులో 17 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  
అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ(మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌). లేదా డిప్లొమా(ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌). మోటారు డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల ఎండార్స్‌మెంట్‌ కలిగి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 21-36 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌-1, పేపర్‌-2) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.330.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 02/11/2022.
ఫీజు చెల్లింపు చివరి తేది: 21/11/2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 22/11/2022.
వెబ్‌సైట్‌: 
https://psc.ap.gov.in


53 హోమియోపతి మెడికల్‌ ఆఫీసర్‌ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయుష్‌ విభాగంలో 53 మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: హోమియోపతిలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.370.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 06/10/2022.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 20-10-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21/10/2022.
రాత పరీక్ష తేదీ: నవంబర్‌, 2022.
వెబ్‌సైట్‌: 
https://psc.ap.gov.in


72 ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఆయుష్‌ విభాగంలో 72 మెడికల్‌ ఆఫీసర్‌(ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: ఆయుర్వేదంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.370.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 06/10/2022.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 20-10-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21/10/2022.
రాత పరీక్ష తేదీ: నవంబర్‌, 2022.
వెబ్‌సైట్‌: 
https://psc.ap.gov.in


ఏపీ ప్రభుత్వ శాఖల్లో 45 నాన్‌-గెజిటెడ్‌ కొలువులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 45 నాన్‌ గెజిటెడ్‌(జనరల్‌/ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
1. శాంపిల్‌ టేకర్‌(ఏపీ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ అండ్‌ ఫుడ్‌ (హెల్త్‌) సబ్‌-సర్వీస్‌): 12 పోస్టులు
2. డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (ఏపీ జువెనైల్‌ వెల్ఫేర్‌ కరెక్షనల్‌ సబ్‌ సర్వీస్‌): 03 పోస్టులు
3. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియో ఫిజిక్స్‌) (ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ సబ్‌ సర్వీస్‌): 04 పోస్టులు
4. అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ (ఏపీ ఫిషరీస్‌ సబ్‌ సర్వీస్‌): 03 పోస్టులు
5. టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ (ఏపీ టౌన్‌, కంట్రీ ప్లానింగ్‌): 02 పోస్టులు
6. జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ (తెలుగు) (ఏపీ ట్రాన్స్‌లేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌): 01 పోస్టు
7. ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌ (ఏపీ ఇండస్ట్రియల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌): 08 పోస్టులు
8. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఏపీ మైన్స్‌ అండ్‌ జియాలజీ సబ్‌ సర్వీస్‌): 04 పోస్టులు
9. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌: 08 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ పోస్టులకు 25-42 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (పేపర్‌-1 , పేపర్‌-2) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.330.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 11-10-2022.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-11-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-11-2022.
వెబ్‌సైట్‌: 
https://psc.ap.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని