నోటిఫికేషన్స్‌

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ) 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 18 Oct 2022 00:42 IST

ఉద్యోగాలు
సీబీఐసీలో 26 గ్రూప్‌ సీ పోస్టులు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ) 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: టిండల్‌, సుఖని, ఇంజిన్‌ డ్రైవర్‌, లాంచ్‌ మెషిన్‌, ట్రేడ్స్‌మ్యాన్‌, సీమ్యాన్‌.
అర్హత: 8, పదో తరగతి. పోస్టును అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
చిరునామా: అడిషనల్‌ కమిషనర్‌(పీ అండ్‌ వీ), కమిషనరేట్‌ ఆఫ్‌ కస్టమ్స్‌(ప్రివెంటివ్‌), జామ్‌నగర్‌, రాజ్‌కోఠ్‌ హైవే, విక్టోరియా బ్రిడ్జ్‌ దగ్గర, జామ్‌నగర్‌ 361001(గుజరాత్‌).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.11.2022
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.11.2022
వెబ్‌సైట్‌: 
www.cbic.gov.in/


జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌..ఒప్పంద ప్రాతిపదికన 13 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డైరెక్టర్‌ (ఎంఐఎస్‌): 1 పోస్టు * సీనియర్‌ పీహెచ్‌పీ డెవలపర్‌: 3 * పీహెచ్‌పీ డెవలపర్‌: 2 * సీనియర్‌ పైతాన్‌ డెవలపర్‌: 2 * కేబీ టెక్‌ సపోర్ట్‌ టీమ్‌: 5 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయసు: డైరెక్టర్‌ పోస్టులకు 55 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 27.10.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తు డీడీని పోస్టు ద్వారా స్వీకరించేందుకు చివరి తేదీ: 03-11-2022.
వెబ్‌సైట్‌: 
http://nirdpr.org.in/


యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. వివిధ ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును బట్టి సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత; పని అనుభవం. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: 
career@ncdc.in
దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022
వెబ్‌సైట్‌:
https://www.ncdc.in/


ఐసీఎస్‌ఐ-గురుగావ్‌లో..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) గురుగావ్‌లోని సెంట్రల్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్‌లో 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ)లో సభ్యులుగా ఉండాలి.
వయసు: 31 ఏళ్లు మించకూడదు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: ఏడాది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.10.2022
వెబ్‌సైట్‌:
https://www.icsi.edu/careers/


అప్రెంటిస్‌

షార్‌-శ్రీహరికోటలో...

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌.. 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును బట్టి పది, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత.
స్ట్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌లకు నెలకు రూ.9,000, టెక్నీషియన్‌కు రూ.8,000, ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.8,050, ఒకేషనల్‌ అప్రెంటిస్‌కు రూ.7,000.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, రివ్యూస్‌ సెక్షన్‌, పర్సనల్‌ అండ్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌-2, టెక్నికల్‌ సర్వీస్‌ బిల్డింగ్‌, ఎస్‌డీఎస్‌ఆర్‌ షార్‌, శ్రీహరికోట, తిరుపతి జిల్లా’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022.
వెబ్‌సైట్‌:
https://apps.shar.gov.in/sdscshar/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని