నోటిఫికేషన్స్

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఎయిమ్స్‌ తాత్కాలిక ప్రాతిపదికన 125 సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 23 Nov 2022 00:08 IST

ఉద్యోగాలు

ఎయిమ్స్‌ భోపాల్‌లో సీనియర్‌ రెసిడెంట్‌లు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఎయిమ్స్‌ తాత్కాలిక ప్రాతిపదికన 125 సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎండీఎస్‌తో పాటు పని అనుభవం.
వయసు: ఇంటర్వ్యూ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022.
వెబ్‌సైట్‌: www.aiimsbhopal.edu.in/


ఎస్‌బీఐలో  క్రెడిట్‌ అనలిస్ట్ట్‌లు

ముంబయిలోని ఎస్‌బీఐ 55 మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్‌(ఫైనాన్స్‌)/ సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం.
వయసు: 30/06/2022 నాటికి 25-35 సంవత్సరాల మధ్య.ఉండాలి.
ఎంపిక: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటరాక్షన్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 12-12-2022.
వెబ్‌సైట్‌: www.sbi.co.in/web/careers#lattest


ప్రకాశం జిల్లాలో ఈసీజీ టెక్నీషియన్‌లు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
* బయో మెడికల్‌ ఇంజినీర్‌: 01 పోస్టు
* ఆడియోమెట్రీషియన్‌/ ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌: 01 పోస్టు * ఈసీజీ టెక్నీషియన్‌: 06 పోస్టులు
* రేడియోలాజికల్‌ ఫిజిసిస్ట్‌: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, పీజీ ట్రైనింగ్‌.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.300).
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్‌ కాంపౌండ్‌, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2022.
వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/


తూర్పుగోదావరి జిల్లాలో పారామెడికల్‌ పోస్టులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన 21 పారామెడికల్‌ పోస్టుల భర్తీకి కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
1. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 04 పోస్టులు
2. ఫార్మసిస్ట్‌: 06 పోస్టులు
3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 04 పోస్టులు
4. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌: 07 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ.
వయసు: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 26-11-2022.
దరఖాస్తు పరిశీలన: 28-11-22 నుంచి 30-11-22 వరకు.
నియామక ఉత్తర్వుల జారీ: 07-12-2022.


అప్రెంటిస్‌షిప్‌

నాల్కోలో 375 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

ఒడిశా రాష్ట్రం అంగుల్‌లోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో) ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్‌ అప్రెంటిస్‌: 375 పోస్టులు
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, బీఎస్సీ (ఫిజిక్స్‌/కెమిస్ట్రీ). శిక్షణ వ్యవధి: సంవత్సరం.
ఎంపిక: సీనియారిటీ, ఐటీఐ/ హెచ్‌ఎస్‌సీ మార్కుల ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా ఆర్డినరీ పోస్టు ద్వారా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌డీ) కార్యాలయం, ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎస్‌ అండ్‌ పి కాంప్లెక్స్‌, నాల్కో, అంగుల్‌ జిల్లా ఒడిశా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2022.
వెబ్‌సైట్‌: https://nalcoindia.com/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని