నోటిఫికేషన్స్‌

ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) 526 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 22 Dec 2022 01:20 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇస్రో-ఐసీఆర్‌బీ, 526 వివిధ ఖాళీలు

స్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) 526 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్లు, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్లు.

* అహ్మదాబాద్‌: 31 ఖాళీలు, *  బెంగళూరు: 215, *  హసన్‌: 17
*  హైదరాబాద్‌: 54, *  న్యూదిల్లీ: 02, *  శ్రీహరికోట: 78, *  తిరువనంతపురం: 129 ఖాళీలు.

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో/6.32 సీజీసీఏతో గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా.

* స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏడాది పని అనుభవం. *  కంప్యూటర్‌ పరిజ్ఞానం.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌/ స్టెనోగ్రఫీ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100 దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2022.
దరఖాస్తుకు చివరి తేదీ: 09.01.2023
రాతపరీక్ష నిర్వహించే ప్రాంతాలు: అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దెహ్రాదూన్‌, గువాహటి, హైదరాబాద్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, న్యూదిల్లీ, తిరువనంతపురం.
వెబ్‌సైట్‌: www.isro.gov.in/ICRB_Recruitment5.html


ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు

బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌ 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ - సి (మెడికల్‌): 3 *  ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ - బి (మెడికల్‌): 5

* రిసెర్చ్‌ అసోసియేట్‌ - 3: 1 * ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (స్టాటిస్టిక్స్‌): 1
*  ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 1 * కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ (గ్రేడ్‌ ఎ): 4
* కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ (గ్రేడ్‌ బి): 2 * ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌: 2
*  డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌ ఎ): 4 * ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 2
* సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 1

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌.  
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.01.2023.
వెబ్‌సైట్‌: https://ncdirindia.org/ Ncdir_Career.aspx


యూపీఎస్సీ- ఎన్‌డీఏ ఖీ ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ (1)-2023

ఖాళీలు: 395 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ ఫోర్స్‌- 120) నేవల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌) 25.
అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఏదైనా గ్రూపులో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ, 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌లకు ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్‌ - పర్సనాలిటీ టెస్ట్‌, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులతో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10 జనవరి, 2023.
ఆన్‌లైన్‌ రాత పరీక్ష: 16 ఏప్రిల్‌, 2023.
వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/


యూపీఎస్సీ- కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (1), 2023

మొత్తం ఖాళీలు: 341. విభాగాల వారీ.. 1. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), దెహ్రాదూన్‌- 100  2. ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 22   3. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్‌- 32   4. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నై (మద్రాస్‌), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌- 170   5. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నై (మద్రాస్‌), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌- 17.

విద్యార్హత: మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. ఎయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. ఆఖరు సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ వైద్య పరీక్షలతో.
పరీక్ష: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 10 వరకు స్వీకరిస్తారు.  
పరీక్ష తేదీ: 2023, ఏప్రిల్‌ 16.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


ప్రవేశాలు

ప్రొ.జయశంకర్‌, శ్రీ కొండా లక్ష్మణ్‌ వర్సిటీల్లో బీఎస్సీ

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (హైదరాబాద్‌), శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ (ములుగు, సిద్దిపేట జిల్లా) 2022-23 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ వ్యవసాయ బీఎస్సీ డిగ్రీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్‌ ర్యాంకర్లు డిసెంబర్‌ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.  ఈడబ్ల్యుఎస్‌ రిజర్వుడ్‌ కేటగిరీ తప్ప మిగిలిన కోటాల విద్యార్థులందరూ ఈ కోర్సుల్లో చేరేందుకు

అర్హులు.

1. బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌(నాలుగేళ్లు): 154 సీట్లు
2. బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌ (నాలుగేళ్లు): 40
3. బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ (నాలుగేళ్లు): 10

అర్హత: ఇంటర్మీడియట్‌ (బైపీసీ)తోపాటు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-2022 ర్యాంకు.
వయసు: 17 నుంచి 22 సంవత్సరాల మధ్య.
ఎంపిక: ఎంసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా.
కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: 28-12-2022, 29-12-2022: అన్ని కేటగిరీలు (ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ)
వేదిక: యూనివర్సిటీ ఆడిటోరియం, పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/admission.html


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని