నోటిఫికేషన్స్‌

గ్రూప్‌-3 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 26 ప్రభుత్వ విభాగాల్లో 1365 పోస్టులను భర్తీ చేస్తారు. అత్యధికంగా ఆర్థికశాఖలో 712 ఖాళీలు ఉన్నాయి.  

Updated : 02 Jan 2023 05:09 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
1,365 గ్రూప్‌-3 కొలువులు

గ్రూప్‌-3 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 26 ప్రభుత్వ విభాగాల్లో 1365 పోస్టులను భర్తీ చేస్తారు. అత్యధికంగా ఆర్థికశాఖలో 712 ఖాళీలు ఉన్నాయి.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 24/01/2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23/02/2023.
వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


783 గ్రూప్‌-2 సర్వీసు ఉద్యోగాలు

టీఎస్‌పీఎస్సీ 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్‌-2లో అత్యధికంగా.. సాధారణ పరిపాలన విభాగంలో సహాయ సెక్షన్‌ అధికారి (ఏఎస్‌వో) 165, మండల పంచాయతీ అధికారి 126, నాయబ్‌ తహసీల్దారు 98, ప్రొబేషనరీ ఎక్సైజ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ 97 ఖాళీలు ఉన్నాయి.

వయసు: 01/07/2022 నాటికి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 21-30 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 18-44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
అర్హతలు: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ(మ్యాథ్స్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌/ లా), ఎంఏ(సోషల్‌ వర్క్‌/ సైకాలజీ/ క్రిమినాలజీ/ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌). డిప్లొమా (టెక్స్‌టైల్‌ టెక్నాలజీ/ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ). ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఆధారంగా.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 18/01/2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16/02/2023.
వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


తెలంగాణ పురపాలకశాఖలో..

తెలంగాణ పురపాలకశాఖలో 78 జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్లు, అకౌంటెంట్‌ అధికారుల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన వెలువరించింది.  

* అకౌంట్స్‌ ఆఫీసర్‌ (యూఎల్‌బీ): 01
* జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(యూఎల్‌బీ): 13  
* సీనియర్‌ అకౌంటెంట్‌ (యూఎల్‌బీ): 64
అర్హత: బీకాం. వయసు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) పేపర్‌-1, పేపర్‌-2 ఆధారంగా.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 20/01/2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11/02/2023.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌): ఆగస్టు 2023.
వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


5,204 స్టాఫ్‌ నర్సు పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీ జరగబోతోంది. డీఎంఈ, డీహెచ్‌ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

అర్హతలు: జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.
వయసు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.620.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 25.01.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.02.2023.
వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm


71 లైబ్రేరియన్‌ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన వెలువరించింది.  
* లైబ్రేరియన్‌ (కమిషనర్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌): 40  
అర్హత: 50% మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(లైబ్రరీ సైన్స్‌) డిగ్రీ.

* లైబ్రేరియన్‌ (కమిషనర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌): 31  
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ (లైబ్రరీ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ డాక్యుమెంటేషన్‌ సైన్స్‌)తో పాటు జాతీయస్థాయి పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. లేదా మాస్టర్స్‌ డిగ్రీతో పాటు నెట్‌/ స్లెట్‌/ సెట్‌ లేదా పీహెచ్‌డీ.
వయసు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) పేపర్‌-1, పేపర్‌-2 ఆధారంగా.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 21/01/2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10/02/2023.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌): మే/ జూన్‌/ 2023.
వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని