నోటిఫికేషన్స్‌

తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలయింది.

Updated : 01 Mar 2023 04:59 IST

ప్రవేశాలు
టీఎస్‌ ఎంసెట్‌-2023

తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలయింది.

1. బీఈ, బీటెక్‌/ బీటెక్‌ (బయో-టెక్నాలజీ)/ బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌)/ బీఫార్మసీ/ బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ)/ బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌/ బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌/ బీఎస్సీ(ఫారెస్ట్రీ)/ బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ. 2. ఫార్మ్‌-డి. 3. బీఎస్సీ (నర్సింగ్‌).

అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. బీఎస్సీ నర్సింగ్‌కు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు:  తెలంగాణలో 16 పరీక్షా జోన్లు ఏర్పాటు చేశారు. ఏపీ లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.900 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500). రెండు స్ట్రీమ్‌లకు రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.1000).

ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ: మార్చి 3- ఏప్రిల్‌ 10 వరకు  

ఎంసెట్‌: మే 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్‌; 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ

వెబ్‌సైట్‌:  https://eamcet.tsche.ac.in/


టీఎస్‌ పీజీఈసెట్‌ - 2023

తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలయింది.  

కోర్సులు: ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌

అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ.

పరీక్ష ప్రాంతీయ కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600).

పరీక్ష: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ: మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు 19 సబ్జెక్టులకు పరీక్షలు: మే 29 నుంచి జూన్‌ 1 వరకు

వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in/


అప్రెంటిస్‌

డీఆర్‌డీవో-జీఆర్‌టీఈ, బెంగళూరులో ..

డీఆర్‌డీవోకు చెందిన బెంగళూరులోని గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ 150 అప్రెంటిస్‌షిప్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీలు- ఇంజినీరింగ్‌ (బీఈ, బీటెక్‌): 75

2. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీలు- నాన్‌ ఇంజినీరింగ్‌ (బీకాం/ బీఎస్సీ/ బీఏ/ బీసీఏ, బీబీఏ): 30  

3. డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీలు: 20 4. ఐటీఐ అప్రెంటిస్‌ ట్రైనీలు: 25

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌.

వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-03-2023.

ఇంటర్వ్యూ/ రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 06-04-2023.

వెబ్‌సైట్‌:  https://rac.gov.in/index.php?lang=en&id=0


యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ఖాళీలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్‌, ఆర్డ్‌నెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 5,395 ఖాళీలున్నాయి. మెదక్‌లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.

ట్రేడ్‌ అప్రెంటిస్‌: 5,395 ఖాళీలు (ఐటీఐకి సంబంధించి 3508; నాన్‌ ఐటీఐకి సంబంధించి 1887 )

ట్రేడులు: మెషినిస్ట్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, పెయింటర్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, మేసన్‌, ఎలక్ట్రోప్లేటర్‌, మెకానిక్‌, ఫౌండ్రీమ్యాన్‌, బాయిలర్‌ అటెండెంట్‌, అటెండెంట్‌ ఆపరేటర్‌ కెమికల్‌ ప్లాంట్‌ తదితరాలు.

అర్హత: ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం; నాన్‌-ఐటీఐ కేటగిరీకికి సంబంధించిన అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.

వయసు: 28.03.2023 నాటికి 15- 24 సంవత్సరాల మధ్య. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు,  దివ్యాంగులకు పదేళ్ల  సడలింపు.

స్టైపెండ్‌: నెలకు నాన్‌-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000.

ఎంపిక: నాన్‌-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.200 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.100).

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28.03.2023.

వెబ్‌సైట్‌:  https://www.yantraindia.co.in/career.php


ప్రభుత్వ ఉద్యోగాలు

బీఎస్‌ఎఫ్‌లో 1284 ట్రేడ్స్‌మెన్‌

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) 1284 కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌)  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. పురుషులు: 1220 2. మహిళలు: 64

విభాగాలు: కోబ్లర్‌, టైలర్‌, వాషర్‌మన్‌, బార్బర్‌, స్వీపర్‌, కుక్‌, వెయిటర్‌.

అర్హత: మెట్రిక్యులేషన్‌/ పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.

* కొన్ని ట్రేడుల్లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ లెవల్‌ 1 కోర్సు పూర్తి చేయాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు)

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా.

* అభ్యర్థులకు ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి.  

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2023.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని