Turn over a lot of money.. అంటే?

Turn over అనే వ్యక్తీకరణ విన్నారా? దీని అర్థాన్నీ, ప్రయోగాన్నీ ఉదాహరణల సాయంతో తెలుసుకోండి. అంతే కాదు...

Published : 08 Aug 2019 00:30 IST

Turn over అనే వ్యక్తీకరణ విన్నారా? దీని అర్థాన్నీ, ప్రయోగాన్నీ ఉదాహరణల సాయంతో తెలుసుకోండి. అంతే కాదు; మీ స్నేహితులతో జరిపే సంభాషణల్లో ఇలాంటివాటిని సందర్భోచితంగా ఉపయోగించండి!

Vinai: I saw Madhavarao yesterday. He was quite all right and healthy. He knew someone and paid him an amount.

(నిన్న నేను మాధవరావును చూశాను. అతడు ఆరోగ్యంగా బాగున్నాడు. ఎవరో తెలిసిన వాళ్లకు కొంత డబ్బు చెల్లించాడు.)

Jayanth: Yea, I know. He is alright and he is quite hale and hearty. He knows someone in the court and paid him a lot of money, so that he may not be called to the court. (అవును, నాకు తెలుసు. అతడు కులాసాగా ఉన్నాడు. కోర్టులో తెలిసిన వాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. కోర్టుకు హాజరు కాకపోవచ్ఛు)

Vinai: Madhavarao knows everybody in the court. He bribed the court official and paid him a lot of money so that he may not be called to court.

(మాధవరావుకు కోర్టులో ఉన్నవాళ్ళంతా తెలుసు. అతడు కోర్టు అధికారికి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చాడు, దాంతో కోర్టుకు వెళ్లకుండా చేసుకున్నాడు.)

Jayanth: So.. he paid a back hander to the official and escaped punishment. (అంటే అధికారికి ముడుపులిచ్చి శిక్షను తప్పించుకున్నాడన్నమాట..)

Vinai: He is good at giving bribes. He can never understand why he should pay such an amount. He is always like that. He always turns over a lot of money for his business in a particular period and avoids all kinds of talking.

(అతడు లంచాలివ్వడంలో సిధ్ధహస్తుడు. అంత మొత్తాన్ని ఎందుకు ఇవ్వాలో ఎప్పుడూ అర్థం చేసుకోడు. అతనెప్పుడూ అంతే. ఒక సమయంలో తన వ్యాపారానికి కావాల్సినంత డబ్బు సమకూర్చుకుంటాడు, తర్వాత అన్ని రకాల మాటలు మానేస్తాడు.)

Jayanth: He turns over a lot of money for his business and is always finds his money on hand.

(అతడు తన వ్యాపారానికి కావలసినంత డబ్బు సమకూర్చుకుంటాడు, చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండేలా చూసుకుంటాడు.)

MODERN ENGLISH USAGE

Notes:

hale and hearty = well (కులాసాగా ఉండటం).

bribe = give an amount of money illegally (లంచమివ్వటం)

Look at the following words from the conversation

1) Turned over = An amount of money taken by a businessman in a particular period. (కొంత డబ్బును వ్యాపార అవసరాలకు తీసుకోవటం)

Vikram: Vijai always knows how to bribe officials.

(అధికార్లకు ఎలా లంచాలివ్వాలో విజయ్‌కి తెలుసు.)

Sankar: He is good at that kind of business. He always turns over a lot of money and finds that he can do business without let or hindrance. (అలాంటి వ్యవహారాల్లో అతడు సిధ్ధహస్తుడు. అతనెప్పుడూ వ్యాపార అవసరాలకు డబ్బు తీసుకుంటాడు, దాన్ని తిరిగి ఇవ్వకుండా, అడ్డంకులు లేకుండా వ్యాపారం చేసుకుంటాడు.)

2) Backhander = Illegal payment. (అక్రమంగా డబ్బు ఇవ్వటం)

a) Jayasankar: Sekhar knows how to bribe officials. He paid a lot of money to court officials so that he may escape being punished.

(అధికారులకు ఎలా లంచమివ్వాలో శేఖర్‌కి తెలుసు. అతడు కోర్టు అధికారులకు చాలా డబ్బిచ్చాడు, కాబట్టి శిక్షపడకుండా అతడు తప్పించుకోవచ్ఛు)

Vinod: He is that sort of guy. He always pays back hander to officials and escapes punishment.

(అతడు అలాంటి వాడే. ఎప్పుడూ అధికారులకు లంచాలిచ్చి శిక్ష పడకుండా తప్పించుకుంటాడు.)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని